Tuesday, 20 May 2025
Sunday, 11 May 2025
Wednesday, 7 May 2025
నమస్తే తెలంగాణ ఒక యోధుడి చేవ్రాలు వనపట్ల సుబ్బయ్య 94927 65358
Sunday, 4 May 2025
స్వర్ణోత్సవ చంద్రిక QUOTES
మానవాభ్యున్నతికి సహృదయత కావాలి. సదస్సులు కావు.
భారతీయ హృదయం పాశ్చాత్య మేధస్సును స్పృశించాలి.
అప్పుడే యుద్ధాలు అదృశ్యమవుతాయి. శాంతి నెలకొంటుంది.
నేను ఈ పనిని నిశ్శబ్దంగా చేస్తాను. జపమాలలో పూసల్లాగా అందరినీ ఏకం చేస్తాను.
స్వామి శుద్ధానందభారతి
తల్లి బిడ్డకు తండ్రిని చూపిస్తుంది. తండ్రి బిడ్డకు గురువును
చూపిస్తాడు. గురువు శిష్యునికి పరమాత్మను చూపిస్తాడు.
తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకే ప్రయత్నాలు సాగిస్తారు.
గురువు సర్వులను తన బిడ్డలుగా చూసుకొని ఉద్ధరిస్తాడు.
స్వామి సుందర చైతన్యానంద
ఏ వ్యక్తీ శాశ్వతంగా చెడ్డవాడు కాడు. శాశ్వతంగా నిరుపయోగమని ఎవరిని
ఖండించ కూడదు. ప్రతివ్యక్తిలో తనను తాను పెంచుకొనే సామర్థ్యముంది.
స్వభావం మారదు అనడం సత్యం కాదు. కొందరిలో అది త్వరగా
మరణిస్తుంది. మూడు మాసాల వ్యవధిలో గొప్ప పరిణామాన్ని చూడవచ్చు.
తాను పరివర్తన చెందుతున్నాడనే విశ్వాసాన్ని వ్యక్తిలో కలిగించే ప్రయత్నం
మనం చేయాలి. నిన్ను నీవు ఎంతో దయతో చూసుకుంటున్నావు. నీపై
నీకు ఎంతో ప్రేమ ఉంది. ఇతరుల విషయంలో కూడా అలాగే ఉండనీ.
స్వామి శివానంద సరస్వతి.
నిన్నటి దుష్టులు నేడు శిష్టులై యున్నారు. నేటి పాపి రేపు పుణ్యాత్ముడు
కావచ్చు. ఈ సత్యం అవగతమైతే నీకు పాపిపై కూడా ప్రేమ పుట్టుకొస్తుంది.
గౌరవం ఏర్పడుతుంది. నేడున్న పాపికి, రేపు కాబోయే సాధువుకు మధ్య నిలిచియున్నది కాలమే నని గ్రహించు. దొంగలు లేనిచోట హాయిగా జీవించవచ్చు. దోమలు లేనిచోట ప్రశాంతంగా నిద్రించవచ్చు. దోషాలు చూడని మనసు క్షీరసాగరమే. అట్టి హృదయాన్ని
పొందగలిగితే నీవూ శాంతాకారమే అవుతావు.
స్వామి సుందర చైతన్యానంద
భగవన్నామ సంకీర్తనము వాతావరణాన్ని పవిత్రంగా, శాంతియుతంగా,
ఆనందప్రదంగా మార్చుతుంది. నామసాధన ఒక్కటే ముముక్షువులకు సరిపోతుంది. నామాన్ని ప్రేమతో గానం చేయడమే ధ్యానము. దానివలన లభించే పారవశ్యమే
సమాధి. నామమే కాంతి. నామమే శాంతి. నామమే శక్తి. నామమే తృప్తి. అదే ప్రసాదిస్తుంది ముక్తి. - స్వామి రామదాస్.
నిద్ర వస్తేనే నీవు నిద్రపోగలవు. నిద్ర రానపుడు నిద్రించాలని నీవు చేసే ప్రయత్నంలో నీకు
శ్రమ కలుగుతుందే గాని శాంతి లభించదు. అలసిపోయిన దేహ మనస్సులు ప్రపంచాన్ని
మరచి నిద్రిస్తాయి. అవే ఉత్సాహంతో ఉంటే ప్రపంచం లోకి పరుగులు తీస్తాయి.
పరిమితమై, దుఃఖమిశ్రితమై, అంతం కలిగిన విషయాలనుండి వివేకంతో, వైరాగ్యంతో నీ
మనసు విరమించినపుడే నీవు ఆత్మలో విశ్రమించగలవు. విషయాసక్తి ఉన్నంతవరకు మనసు ప్రపంచం వైపే పరుగులు తీస్తుంది. బ్రతుకు మూన్నాళ్ళ ముచ్చట. చెప్పిరాని బ్రతుకు చెప్పకుండానే జారిపోతుంది. విషయాలు విషపూరితాలు. బాంధవ్యాలన్నీ బరువులే. సంసార వ్యామోహాన్ని నింపుకున్న హృదయాలు ఎన్నడైనా, ఎప్పుడైనా కన్నీటి చెరువులే. అసత్యంతో అలసిపో, సత్యంలో పవ్వళించు. సత్యమై మేలుకో. సత్యప్రపంచాన్ని మకుటంలేని మహారాజుగా ఏలుకో.
స్వామి సుందర చైతన్యానంద
అద్దంలో కనిపించిన మన రూపాన్ని ప్రతిబింబంగా మనము
తెలుసుకుంటాము. అదే ఒక జంతువు చూస్తే దానిని కుమ్మడానికి పోతుంది.
అది తన ప్రతిబింబమే అని దానికి తెలియదు.
అలాగే ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ మన ప్రతిరూపాలే.
ఈ సత్యం గ్రహించక భేదదృష్టితో వీక్షిస్తున్నాం. దుఃఖాన్ని ఆహ్వానిస్తున్నాం.
శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి.
విశాలమైన సాగరంలో ప్రతిబింబించిన ఆకాశమే మురికి
గుంటలో కూడా ప్రతిబింబిస్తుంది. అదే ఆకాశము యొక్క
విశాల హృదయము. గుణదోషాలు ఎవరివి వారి కుంటాయి. ఆకాశంలాగ వెలిగిపోయే
విశాల హృదయంతో శోభించాలి. ఈ అవగాహనా కాటుకయే
నాలోని భేదభావ చత్వారాన్ని కొంతవరకు చెదరగొట్టింది.
స్వామి సుందర చైతన్యానంద
సందేహాలు, భయాలు, బాధలు ఎవరివో నిన్ను నీవే ప్రశ్నించుకో. మరుక్షణంలో
అవి మాయమవుతాయి. వాటికి ప్రాధాన్యత నివ్వకు. దృష్టిని ఆత్మవైపు మరల్చు
కోహం నేనెవరు? అని విచారించు. నీవెవరో తెలిస్తే నీకన్నా అన్యంగా, దూరంగా ఏదీ లేదని, ఎవరూ లేరని. తేలుతుంది. రెండవది లేదు కనుక బాధలు, భయాలు కూడా ఉండవు.
కోహం నేనెవరు? అని ధ్యానించడం విచారణకాదు. 'నేను' అనే ఆలోచన (అహం వృత్తి) నీలో ఎక్కడ నుండి కదులుతూ ఉందో ఆంతర్యంలో మునకవేసి, మరో ఆలోచన రాకుండా ఆ 'నేను' అనే వృత్తిని గుర్తించాలి. ఆ తరువాత, ఈ 'నేను' ఎక్కడ నుండి పుడుతూ ఉంది అని
ప్రశ్నించగనే ఆ 'నేను' అనే వృత్తి కూడా పడిపోతుంది. నీలో నీవు నీవుగా ఉండిపోతావు. ఇది 'నేనెవరు? అనే విచారణ మార్గము.
భగవాన్ రమణ మహర్షి
దేనిని ముట్టుకోకు. ఎవరిని పట్టుకోకు. సరళంగా ఉండు. సాక్షిగా ఉండు.
భావాలను బయటపడిపోనీ. చూపు దూరంకానీ, లోచూపు దగ్గర కానీ.
'ఇదం' అహంలో కలిసిపోనీ. అహం' పోయి 'అహం' మిగలనీ.
అలా ఉండిపో. అలగా ఉండకు. ఇలా వెలిగిపో. 'ఇదం' గా మిగలకు.
అహమేవ. అహమేవ. అహమేవ. నేనే. నేనే. నేనే.
“భావనాం అఖిలం త్యక్త్యా యచ్ఛిష్టం తన్మయో భవ!”
సమస్త భావాలను విడిచిపెట్టి ఆ తరువాత ఏది మిగులుతుందో
దానిలో తన్మయుడవై ఉండిపో అని వరాహోపనిషత్తు.
స్వామి సుందర చైతన్యానంద
ప్రార్ధన అనేది యాచన కాదు. అది ఆత్మయొక్క స్పందన.
పరమాత్మకు తన బలహీనతలను అర్పించడం.
హృదయం లేని పలుకులతో ప్రార్థించడం కన్నా
పలుకులు లేని హృదయంతో పూజలో ఉండుటయే ఉత్తమము.
మహాత్మాగాంధీ
నీవు సుఖపడు. కాని ఇతరులు కూడా సుఖంగా ఉండాలని భావించు.
నీ దుఃఖానికి ఇతరులు కారణం కాకూడదు.
నీవు కూడా ఇతరుల దుఃఖానికి కారణం గాకు.
నీ కష్టాల్ని ఇతరులు పంచుకోకపోతే నీ బాధ పది రెట్లు అధికమవుతూ ఉంది.
ఇతరుల కష్టాల్ని పోగొట్టే ప్రయత్నాలు ఇప్పటికి నీవు ఎన్ని చేశావో ఆలోచించు.
మచ్చిక తెలియని పిచ్చిమనసు పచ్చి కురుపులాంటిది. సూదులతో గ్రుచ్చినట్లే
ఉంటుంది. ప్రేమ అనే మందును రాసి ఆ వ్రణాన్ని నయం చేసుకోవాలి. అప్పుడే
మనిషికి స్ఫూర్తి, మనుగడకు దీప్తి లభిస్తాయి.
స్వామి సుందర చైతన్యానంద
నిరాడంబర జీవనము, సన్మార్గవర్తనము కలిగి, మనస్సును
కోరికల వైపు పోనీయక, దైవాధీనము గావించి ముక్తిని
పొందుట యందు కర్తవ్యములను పాటించి ధర్మము
ననుసరించుటయే జీవితాశయము.
స్వామి చిదానంద.
ఇతరులు నిన్ను అర్థం చేసుకోవాలని నీవు ప్రయత్నించినంత కాలము నిరాశతో
నీవు వ్యథ చెందుతూ ఉంటావు. నీ వ్యథ ఇతరులకు ఎప్పుడూ ఆదర్శం కాదు.
నిన్ను ఇతరులు అర్థం చేసుకోవడం కల్ల. వారిని వారు తెలుసుకోవడానికి
చేతనైనంతగా నీవు సహకరిస్తూ ప్రశాంతంగా ఉండు. ఏదీ ఆశించకుండా
ఆనందంగా ఉండు. నీ ప్రశాంతతను చూచి వాళ్ళు ఆకర్షితు లవుతారు. నిన్ను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. తద్వారా వారిని వారు అర్థం చేసుకుంటారు. ఇలా సమాజానికి నీ సహాయం ఉంటుంది. నీకు నీవుగా నిత్య తృప్తుడవై ఉంటావు.
ఇది నేను మీకు చెబుతున్న విషయం కాదు. నాతో నేను చేసుకున్న ఒడంబడిక.
స్వామి సుందర చైతన్యానంద
భగవంతునితో అవిభక్తమై జీవించుటయే ఉత్తమభక్తి.
సమాజము విశ్వము పరమాత్మ వ్యక్తరూపాలే కనుక భక్తుడు
వాటితో ఐక్యతను, అఖండతను కలిగియుంటాడు.
తాను వేరు అనే భేద భావము కదిలినపుడే భక్తి ప్రవాహము
ఇంకిపోవడం ప్రారంభమవుతుంది.
వినోభావే
మనం మానవులం. ఓ మానవా! మానవా!
ఈ పాడుకర్మలు మానవా! మానలేవా? కనుక,
మానవా! అని పిలువగానే ఇకనైనా దుష్కర్మలు
మానవా? అనే ప్రశ్న ధ్వనిస్తూ ఉంది.
స్వామి సుందర చైతన్యానంద
తనను తాను అన్వేషించువాడే ముముక్షువు.
'నేనెవరు?' అనే ప్రశ్న తప్ప అన్యమైన వాటిని వదలిపెట్టు.
'నేనున్నాను' అనేది వాస్తవం.
'నేను అదిగా ఉన్నాను - ఇదిగా ఉన్నాను' అనేది అసత్యం.
నిసరదత్ మహరాజ్.
చెఱసాలలో బంధీయైనవాడు ఇంక కొంచెము అన్నము,
మరొక దుప్పటి, మరికొన్ని పాలు కాదు అడుగవలసింది.
కారాగృహం నుండి విడుదల చేయమని అడగాలి. అలాగే,
సంసారంలో పడి కొట్టు మిట్టాడుతున్న మనం ఆశించవలసింది,
అర్థించవలసింది బంధవిముక్తినే గాని విషయసుఖాలను కాదు.
మోక్షాన్నే గాని మోహాన్ని గాదు.
స్వామి సుందర చైతన్యానంద
మహాపురుషుల చరిత్రే మహికి చరిత్ర
అన్నాడొక మహామనిషి,
ప్రపంచం ఎన్నడూ చూడని మహర్షుల
జీవితాలతో, జీవితోపదేశాలతో
దీర్ఘకాల చరిత్ర గల భారతావనికి
ఈ సత్యం చక్కగా అన్వయిస్తుంది.
స్వామి రంగనాధానంద.
దగ్గరై బాధించేది ద్వేషము. దూరమై బాధించేది రాగము
ఈ రెండిటి మధ్య దొర్లిపోయే బ్రతుకు చెండుకు
అడుగడుగునా దెబ్బలే. ప్రతి అడుగునా మడుగులే.
ఎక్కడైనా, ఎప్పుడైనా
రెండున్న చోట తప్పవు గండాలు
అవే బ్రతుకులో సుడిగుండాలు.
స్వామి సుందర చైతన్యానంద
చిత్తశుద్ధి గల సాధకులు తమ మనస్సును తమలోని
సత్యాత్మమీదే సదా లగ్నం చేయాలి.
ఎన్ని అవరోధాలడ్డు నిలిచినా జీవనది ప్రతిక్షణము
సాగరముఖంగా ఎలా సాగిపోతుందో, అలాగే సాధకుని
భావనా ప్రవాహం భావమూలమైన ఆత్మ చైతన్యం వైపునకే
పయనించాలి. ప్రవహించాలి.
స్వామి తపోవనం.
చూపు ఉండి చూడని వాని కన్నా గ్రుడ్డివాడే నయం. తెలివి ఉండి శాస్త్ర
జ్ఞానాన్ని వంట బట్టించుకోనివాడు సుందర దృశ్యాల మధ్య గ్రుడ్డివాడున్నట్లే
ఉంటాడు. ఇదే దురదృష్టం.
ప్రేమ అంటే జ్ఞానము. ప్రమాణము ఉన్నప్పుడే ప్రమ కలుగుతుంది. భ్రమ
తొలగుతుంది.
శాస్త్రమే ప్రమాణము. శాస్త్రాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవాలి. మననం
ద్వారా సుస్థిరంగా హృదయంలో నిలుపుకోవాలి.
అధ్యయనము కేవలం బుద్ధితో పడే కుస్తీ కాకూడదు. భక్తి, నమ్రత, ప్రేమ
అనే మాధుర్యాలన్నీ అధ్యయనంలో మిళితం కావాలి. ఆచరణ లేకుండా
బుద్ధిని శాస్త్ర జ్ఞానంతో నింపుకోవడం, ఏదో తెలిసిపోయినట్లు అహంకారంతో
విర్రవీగడం ప్రగతి కారకం కాదు. పతన హేతువు.
బుద్ధిని జ్ఞానంతో నింపుకోవాలి. హృదయం ప్రేమతో తడిసి ఉండాలి.
అప్పుడే బ్రతుకు తియ్యగా ఉంటుంది. నీవు శాంతిగా ఉంటావు.
స్వామి సుందర చైతన్యానంద
*******************************************
గురువు ఒక వ్యక్తి కాదు.
అతడు పరమాత్మ వాణి.
అలాంటి గురువు లభించి, అతడు బోధించిన దానిని ఏ
కొద్దిపాటి అర్థం చేసుకున్నా ప్రగతి సుస్పష్టంగా తెలుస్తుంది.
గురుబోధ ఎప్పుడూ నిష్ఫలం కాదు.
అది నిత్య సంవర్థకం.
శిష్యుడు గురువును కలుసుకోవడమే
గొప్ప మహిమ.
స్వామి చిన్మయానంద.
సాధువు ఎవరో కాదు. నిగూఢ వైభవానికి నిలయం. నిశ్శబ్ద
సౌందర్యానికి ఆలయం.
అభ్యుదయంతో అలరారే సమాజానికి రహస్యమైన స్ఫూర్తి,
పవిత్రమైన శక్తి సాధువే.
అతడు నీకు ఓదార్పు నిస్తాడు. నిన్ను ఉత్తేజపరుస్తాడు. ప్రభావితం
చేస్తాడు. ప్రబోధాన్ని అందిస్తాడు.
ఇదంతా అతను చేయడానికి అతనికి సహకరించేది ప్రేమ ఒక్కటే.
స్వామి సుందర చైతన్యానంద
****************************************
దేహానికి బాధ ఉంది అనేది సత్యం.
నాకు బాధ ఉంది అనేది భావన.
భ్రాంతి. ఇదే సంసారము.
ఆత్మ ఎన్నడూ భోక్తకాదు. ఎందుకంటే, ఆత్మ ఏనాడూ కర్త కాదు.
కర్తృత్వము నుండి తాను ముక్తుడని గ్రహించినవాడు
భోక్తృత్వము నుండి కూడా విముక్తుడే.
స్వామి దయానంద.
జ్ఞానానికి ప్రమాణమే ప్రధానం.
ఆ ప్రమాణం శాస్త్రమే.
శాస్త్రాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
శ్రద్ధాభక్తులతో శాస్త్రమాతను సమీపించాలి. నమ్రతతో,
విశ్వాసంతో అనుసరించాలి.
మన భావాలకి అనుగుణంగా ఉండాలని శాస్త్రానికి వక్రభాష్యం
చేయకూడదు.
అలాగే, శాస్త్రాన్ని వడపోసే పద్దతి కూడా మంచిదికాదు. ఆ
వడపోతలో ఒకొక్కసారి సత్యము కారిపోయి అసత్యము
మిగిలిపోయే ప్రమాదము కూడా కలుగవచ్చు.
స్వామి సుందర చైతన్యానంద
*********************************
పుణ్యకర్మములు, జపములు, ప్రార్థనలు,
భజనలు మొదలైనవి పుణ్యప్రాప్తినే
కలిగిస్తాయి. కాని భవసాగరమును
దాటుటకు ధ్యాన సమాధి మొదలగు
ఆత్మసాక్షాత్కార నిష్ఠ గల్గి యుండవలయును.
లేనిచో భవసాగరమును దాటుట కష్టము.
శ్రీ మళయాళ స్వామి.
వెన్నుని చేతిలో వేణువువలె నీవూ జీవన రాగాన్ని ఆలపించు.
వాణీ ఒడిలోని వీణవలె నీవూ విజ్ఞాన రవములను పలుకు.
నాగభూషణుని మోసే నందీశ్వరుని వలె నీ మస్తకము జ్ఞాన
సంపదను మోయనీ.
మోసేది తానే అయినా మాతంగవదనుని ముందు మూషికము
చిన్నదై తిన్నగా యున్నట్లు నిన్ను త్రిప్పే కోరిక నీ ముందు చిన్నదై
పోనీ, ప్రయత్నించు.
స్వామి సుందర చైతన్యానంద
****************************************************
నిద్ర లేచింది మొదలు నిద్రించేవరకు ఏదో ఒక కార్యంలో మనం నిమగ్నమై
ఉంటాము.
ఆ కర్మలన్నీ మనం భగవంతుని వైపు మళ్ళించాలి.
ఆ విధమైన ఆచరణ వల్ల మన హృదయంలో శాంతి నిలుస్తుంది. మనం మాట్లాడే
పలుకులన్నీ భగవత్సంబంధమైనవిగా ఉండాలి.
"ఇది పవిత్రమైన కర్మయేనా? దీనిని పరమాత్మ అంగీకరిస్తాడా?" అని ప్రతిపని
చేసే ముందు ఆలోచించడం అలవరచుకోవాలి.
స్వామి జయేంద్ర సరస్వతి.
ఉండకూడనిది ఉన్నంతకాలం ఉన్నతి సాధ్యం కాదు.
సృష్టిలో దృష్టిని సారించువానికంటే దృష్టిలోని సృష్టిని
సవరించుకొనువాడే పుష్టిని, సంతుష్టిని అనుభవిస్తాడు.
కష్టములను, కన్నీటిని అధిగమిస్తాడు.
నీకు అన్నీ తెలుసు. పాపం.... నిన్ను గూర్చి మాత్రమే నీకు
తెలియదు. అంతే. ఇప్పటికి అంతే. బ్రతుకంతా అంతే అయితే
ఇక జీవితములో మిగిలేది చింతే.
స్వామి సుందర చైతన్యానంద
*************************************************
ఆధారభూతుడైన పరమాత్మపై జగత్తు ఆధారపడి ఉంది.
కనుక అహంకారానికి అవకాశమివ్వకుండా వినయ విధేయతలతో భక్తి
శ్రద్ధలతో సర్వకర్మలను ఆచరించాలి.
సర్వమయుడైన పరమాత్మను గ్రహించడమంటే అహంకారమును
పోగొట్టుకోవడమే గాని బాధ్యతల నుండి పారిపోవడం కాదు.
స్వామి విశ్వేశతీర్థ
తామరాకుపై నీటి బొట్లు నిలుస్తాయి. పరవశిస్తాయి. ఆణిముత్యాల్లా
గోచరిస్తాయి. గాలి వీస్తుంది. పత్రం చలిస్తుంది. మురిసే బిందువులు
ఒరిగిపోతాయి. నీటిలో రాలిపోతాయి.
బ్రతుకులోని సంపదలన్నీ నీటి బిందువులే అని మరువకు. కాలపవనాలు
వీచగానే కనుమరుగవుతాయని తెలుసుకో. అసత్య వస్తువు నీకు ఎన్నడూ
అండకాదు. లేనిది లేమిని లేకుండా చేయలేదు.
వేదనలకు స్వస్తి చెప్పు. బ్రతుకునే నివేదనగా మార్చుకో.
పరమాత్మ కొరకు పరితపించేవారు ధన్యజీవులు.
స్వామి సుందర చైతన్యానంద
***************************************
Body? OR Almighty
Much as you love your daughter, one
day you have to marry her off and part.
Much as you would like to keep your
body, oneday it must, mingle with dust.
Now think, where do you put your
mind? In the body, or in the Almighty?
-Swamy Sundara Chaitanyananda
**************************************8
God is an Ocean of Love
Devotee is an embodiment of Love
Devotion is an exalted form of Love
Love sees no differences
Love has no malice
Love is beyond dualities and distinctions.
-Swamy Sundara Chaitanyananda
***************************************
అనేక ప్రదేశముల నుండి వచ్చిన జంతువులు మండుటెండలో
ఒక చెట్టు నీడలో విశ్రమిస్తాయి. నానా దిక్కుల నుండి వచ్చిన
పక్షులు రాత్రివేళ ఒక చెట్టుపై కూర్చొని కునుకుదీస్తాయి.
సాయంత్రమయ్యేసరికి జంతువులు, ఉదయమయ్యే సరికి
పక్షులు వాటి దారిన అవిపోతూ ఉంటాయి.
నాకు ఎవరు దూరమైనా ఎవరికి నేను దూరమైనా నా
ముందు ఆ పశువులు, పక్షులే కదుల్తాయి.
స్వామి సుందర చైతన్యానంద
*******************************
ఎన్నో, మరెన్నో నదులు దూకుడుగా వచ్చి పడుతూ
ఉండినా సముద్రము నిశ్చలముగా, పూర్ణంగా శోభిస్తూ
ఉంటుంది. ఆహ్వానం లేకుండా నదీజలాలు
దొర్లుకొంటూ వచ్చి పడుతున్నాయి. ఆవేదన లేకుండా
సాగరం వెలిగిపోతూ ఉంది.
ఊహించని రీతుల్లో బాధలు వచ్చి పడుతున్నా,
భరించలేక గుండె బరువెక్కుతున్నా, నన్ను నన్నుగా
నిలిపింది సాగర స్ఫూర్తియే. సాగర చైతన్యమే.
స్వామి సుందర చైతన్యానంద
***************************
Snug As a Bug in a Rug
During Brahma
muhurtam you pull the rug
over your face, tuck it under
your feet and lie curled up
snugly in your bed.
Do you ever jump out
of bed the moment you are
awake, take a bath and sit
for meditation?
-Swamy Sundara Chaitanyananda
*****************************************
Words without love do not sound sweet
worship without devotion does not move God
Service without sacrifice does not bear fruit.
-Swamy Sundara Chaitanyananda
************************************
రేకు లెన్ని ఉన్నా పువ్వు అద్వైతమే
కారణాలేవైనా నవ్వు అద్వైతమే.
నేనని భ్రమించినా నీవూ అద్వైతమే.
నువ్వని పలికినా నేనూ అద్వైతమే.
అద్వైతమే శాంతి.
అద్వైతమే కాంతి.
అన్ని విద్యలలోన అధ్యాత్మమే గొప్ప.
మరొకటి లేదు ఇలలో పరమాత్మ తప్ప.
స్వామి సుందర చైతన్యానంద
******************************
ఆప్తుని ఇంట్లో అతిథి వసిస్తాడు. ఎంతకాలం వసించినా
ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళాలని అతిథికి తెలుసు. ఇది తెలిసి
జీవించినపుడే అతిథికి సుఖశాంతు లుంటాయి.
ఆప్తుని ఇంట్లో అతిథి వసించినట్లే దేహంలో జీవి వసిస్తాడు.
ఎంతకాలం వసించినా ఒక క్షణాన విసర్జించవలసిందే.
"మీరు కాలుమోపారు. ఇది మీ ఇల్లే స్వామి. మీదే" అని
ఆతిథ్యమిచ్చిన భక్తులు ప్రేమతో పలికినపుడు నా నుండి
తొంగిచూచే నవ్వు పెదవుల్ని విడదీస్తుంది.
"ఈ దేహమే అద్దెగృహం. ఇది వసించిన ఇల్లు నాది
అవుతుందా?" అని మనస్సు ఏదో అవుతుంది.
స్వామి సుందర చైతన్యానంద
***********************************
He who believes in God never fails. Let the
world hate you, harass you, discredit you
and despise you. As long as you have faith
in God. Victory is yours. This is true, true.
ever so true.
-Swamy Sundara Chaitanyananda
*******************************************
Without being connected to the
main switch can a bulb give you light?
Without having associated
himself with God can your Guru
light up your life?
-Swamy Sundara Chaitanyananda
************************************************
ఒక అద్దము మరొక అద్దమును ప్రతిబింబించినపుడు
వాటిలో దేనిని ఏది ప్రతిబింబిస్తున్నది?
"మీరు సాధువులని మేము మీకు నమస్కరిస్తే,
అభయహస్తం చూపి మమ్మల్ని ఆశీర్వదించకుండా
మీరు మాకు ప్రతి నమస్కారం చేస్తారేమిటి?"
అని భక్తులు ప్రశ్నించినపుడు ఈ అద్దమే నా ముందు
అద్దంలా నిలుస్తుంది.
స్వామి సుందర చైతన్యానంద
**********************************8
నిర్మలంగా, విస్తరంగంగా శోధించే జలాశయంలో కాలు
మోపాలంటే పూర్వం లాగ ధైర్యం లేదు. ఏదో భయం ఆవరిస్తోంది.
నా ప్రవేశం వల్ల జలాశయం యొక్క ప్రశాంతత దెబ్బ
తింటుందేమో! అని మెల్లగా అడుగిడి నడుస్తున్నాను.
ఎంత మెల్లగా అడుగిడినా అలజడి ఏదో కొద్దిగా ఉండనే ఉంది.
అది తప్పేలాగ లేదు. అలలు కదిలేచోట అలజడి తప్పదేమో!
వ్యవస్థ నిర్మాణంలో వ్యక్తిత్వం తలెత్తకుండా ఉండదు.
వ్యక్తిత్వంలో కాలూని వ్యక్తిగా మిగలడం మ్రింగుడు పడని
కార్యమే.
స్వామి సుందర చైతన్యానంద
**********************************
Now a days we are all buzzing around
with activity doing voluntary services
to social, spiritual and cultural
organizations. But have these activities helped
us to evolve mentally, morally, and
spiritually? Service sans spiritual and
moral Values can never be complete.
-Swamy Sundara Chaitanyananda
**********************************
Sweet Bitter? or Bitter Sweet
None likes the bitter tablet
All love the sweet chacolate
Lust is bad like the sweet to a patient
While Love is good like the tablet.
-Swamy Sundara Chaitanyananda
**************************************
నేటి శ్రద్ధ రేపటి జ్ఞానానికి పునాది. పరమాత్మను
త్యజించిన మానవులున్నారే గాని పరమాత్మ చేత
త్యజింపబడినవారు ఒక్కరు కూడా లేరు.
ఎన్ని పనులైనా చేసుకో. కాని పరమాత్మను
మరువకుండా చూసుకో.
ఒక్క దారము ఎన్నో పువ్వులను ఒక మాలలో కలిపి
ఉంచునట్లు, అందరిని ఏకంచేసే దివ్యశక్తి పరమాత్మ ఒక్కడే.
మనము నిద్రిస్తూ ఉంటాము. మేల్కొంటూ
ఉంటాము. పరమాత్మ నిద్ర ఎరుగడు. అతనిది నిత్య
జాగరణ. వ్యక్తుల్ని, విశ్వాన్ని రక్షించేది అతడే.
స్వామి సుందర చైతన్యానంద
**********************************
Remember, that it is God
that gives you and God that takes from you.
If you live with this kind of attitude
you will neither love those who give you
nor hate those who take from you.
Swami Sundara Chaitanyananda
***************************************
విషయాలు వృత్తులపై ఆధారపడి ఉన్నాయి.
వృత్తులు 'అహం' వృత్తిపై ఆధారపడి ఉన్నాయి.
'అహం' వృత్తి 'అహం' చైతన్యముపై ఆధారపడి ఉంది.
విషయాలను, వృత్తులను, అహంవృత్తిని 'అహం'
చైతన్యము ప్రకాశింపచేస్తూ ఉంది. అవేవీ లేనపుడు
'అహం' చైతన్యము తనకు తానుగా స్వప్రకాశమై భాసిస్తోంది.
స్వామి సుందర చైతన్యానంద
**************************************
వాగి వాగి ఆగుతాడు వదరుబోతు
బాధలాస్తే మారుతాడు పొగరుబోతు
వ్యాధికి భయపడి మానేస్తాడు త్రాగుబోతు
ఏది వచ్చినా మారనివాడు సోమరిపోతు.
స్వామి సుందర చైతన్యానంద
********************************
పుట్టగానే నవ్వే పువ్వులా
ఉప్పునీరు త్రాగి మంచినీరు ఉమ్మే మేఘంలా
కాల్చినా కలత చెందక కమ్మని వాసన నిచ్చే కర్పూరంలా
ఎండలో మండినా చల్లదనం చెదరని చందనంలా
చరించగల వారెవరో తెలుసా? వారే సాధకులు.
స్వామి సుందర చైతన్యానంద
********************************************
తప్పు చేయడం కన్నా చేసిన తప్పును
సరిదిద్దుకోకపోవడం పెద్ద తప్పు.
ఒప్పు చేయలేకపోగా దానిని మరోవిధంగా
కప్పిపుచ్చుకోవాలని యత్నించడం ఎప్పుడైనా ముప్పే.
వట్టి చేతులతో, ఓటి చేతులతో ఈ ప్రపం
చంలో అడుగుపెట్టి, ఆ తరువాత ప్రతిదానిని
'నాది - నాది' అని పట్టుకోవడం మనిషి చేసిన తప్పు.
'నాది' అని పట్టుకున్న దానిని 'నీది' అని విడిచి
పెట్టడమే ఒప్పు. అదే అర్పణ. నిజానికి సమర్పణ.
స్వామి సుందర చైతన్యానంద
*************************************
కలిసి వచ్చేది రానీ, విడిచిపోయేది పోనీ.
సంయోగాలలో సంబరపడకు.
వియోగాలలో విలపించకు.
నదులు కలిసాయని అబ్ధికి ఆనందమా?
నీరు ఆవిరైందని జలధికి దుఃఖమా?
నీవూ అంతే. నీవు దివ్యానంద సాగరానివి.
నిన్ను పెంచేవారూ లేరు. తగ్గించేవారూ లేరు. నిండుగా ఉండిపో,
దండిగ సమస్తములో నిండిపో, ప్రశాంతతలో పండిపో..
స్వామి సుందర చైతన్యానంద
******************************************
గాలినై తిరిగితి గతజన్మముల లోన
వర్షమై పడితి ఇపుడీ ఉర్విలోన
చతికిల బడితి నిచట మట్టిముద్దనై
కాల్చవేమి నన్నిక నిప్పు ముద్దవై
ఆకసముగ ఒక వెలుగు నన్ను వెలిగిపోనీ!
అంబరమును చుట్టుకొని నన్నుగా మిగిలిపోనీ!
స్వామి సుందర చైతన్యానంద
***********************************
మాపు ప్రక్కనే రేపు ఉంది అనుకుంటాం. ఈ లోగా
పడుతుంది యముని చూపు. ఇక మాపు కూడా రాదు.
అంతా మార్పే. ఇదే కాలమిచ్చే తీర్పు.
నాడు లేదు నేడు. వస్తుందో లేదో ఒకనాడు.
ఉన్న నేడు కూడా తామరాకుపై నీటిబొట్టే.
గోకేదేదో తామరకాలంలోనే జరిగిపోవాలి.
తారాడుతూ, జీరాడుతూ ఉంటే మృత్యుకూపంలోకి
జారిపోవడమే. వర్షాకాల మేఘంలా ఈ ప్రపంచంలో కారిపోవడమే.
స్వామి సుందర చైతన్యానంద
************************************************
వ్యక్తి వికాసం, సమాజ అభ్యుదయం మన లక్ష్యం.
ఈ లక్ష్య సిద్ధికి మనం శ్రమిస్తాం. పరిశ్రమిస్తాం. కాని.
చేతులు చేతులు నలిపి కాదు.
మనసులు మనసులు కలిపి.
హృదయాలను హృదయాలతో పెనవేసి.
ప్రేమతో నిండిన హృదయాలు ఆచరించే కర్మలన్నీ యజ్ఞాలే.
స్వామి సుందర చైతన్యానం
******************************
ధనహీనుడు దరిద్రుడు కాడు.
భక్తిహీనుడే నిజమైన దరిద్రుడు.
అన్నీ ఉండినను దీనుడే.
పరులపై ఆధారపడి జీవించు వారందరు దీనులే. ఈ ప్రపంచంలో
ఇల్లు కట్టేవారి మీద, ఇంటిని కడిగేవారి మీద బ్రతికి
నపుడు ఆధారపడాలి. గుంట త్రవ్వే వాడిమీద, మట్టి నింపే
వాడిమీద చచ్చినపుడు ఆధారపడాలి.
భక్తులే నిరాశ్రయులు. కనుక, నిత్యతృప్తులు.
స్వామి సుందర చైతన్యానంద
*********************************************
కొండెములు చెప్పువాడు కొండెగాడు. నిజానికి తేలు కొండెగాడు.
కొండెతో తేలు దేహాన్ని కుడుతుంది. కొండెము అనే
కొండెతో కొండెగాడు చెవిని కుడుతాడు. తేలు
తెలియకుండా కుడుతుంది. కొండెగాడు నిజం తెలియ
నివ్వకుండా చెవిలో అబద్ధాలు నూరిపోస్తాడు.
వీనులలో విషాన్ని నూరిపోసే కొండెగాడు తేలు కన్నా
భయంకరమైన వాడు.
స్వామి సుందర చైతన్యానంద
*****************************************
ఆశను దాటితే నిరాశను దాటినట్లే.
ఆశనిరాశల కెరటాలను అధిగమించిన వాడు
సుఖసాగరంలో ఓలలాడుతాడు.
ఆశలేని మనసులో ఆవేదన ఉండదు.
ఆవేదన లేని చిత్తంలో అలజడి మిగలదు.
అలజడి లేని చోట సంసార భావన కలుగదు.
సంసార భావన లేకపోతే ప్రపంచమే లేదు.
ప్రపంచము లేనిచోట దుఃఖాన్ని ఊహించలేము.
స్వామి సుందర చైతన్యానంద
**********************************************
బాధించే ప్రపంచానికి సేవలు అందిస్తూ సాగిపో!
బాధను నివారించే పరమాత్మతో కలిసి జీవించు.
మేను ప్రపంచానికి, మనసు పరమాత్మకి.
ఎవరు ఎలా ప్రవర్తించినా అదంతా భగవానుని
సంకల్పమే నని సరిపెట్టుకో. నీవు సరిపడి ఉంటావు.
మనసును పురిపెట్టుకోకుండా హాయిగా, తృప్తిగా ఉంటావు.
స్వామి సుందర చైతన్యానంద
*****************************************
You can get pearls only if you dive deep
into the sea. What you find on the sea
shore are only snail shells. There is noth-
ing in the world outside except darkness
and duality. Turn your mind inwards. The
real treasure lies there in.
Swami Sundara Chaitanyananda
********************************************
మనల్ని మోసగించుకున్నది మనమే.
మనస్సు చెప్పిందల్లా చేశాం. పాడైపోయాం.
బంట్రోతు ఉద్యోగం చేశాం. బాధల్ని
కొని తెచ్చుకున్నాం. కంట్రోల్ చేసే శక్తి లేక
బ్రతుకుపై పెట్రోలు పోసి అంటించుకున్నాం.
ఇక మనసుకు వీడ్కోలు పలుకుదాం
మహాత్ములను వేడుకొని తరిస్తాం
స్వామి సుందర చైతన్యానంద
**************************************
A saint does not wish that his
present pattern of life must be
different nor does he try to change
the existing scheme of things
around him. He examines the pros
and cons of every situation and
accepts the inevitable. It is not that
the saint is insensible to pain and
pleasure. Though experiencing them
he remains unruffled by them and
steadfast in his wisdom.
-Swamy Sundara Chaitanyananda
*****************************************
The boat of life sails for Godhead
The wind of His grace ever blows
But the sails have not been raised
And His grace silently passes by
-Swamy Sundara Chaitanyananda
**************************************
నిరహంకారి తప్పుచేసినా సరిచేసుకోగలడు.
సమాజము అతనిని అర్థం చేసుకొని సానుభూతి చూపుతుంది.
పరమాత్మ క్షమించి మరొక అవకాశం ఇస్తాడు.
అహంకారికి తప్పు చేయడమే తెలుసు. సరిచేసుకోవడం అతనికి
చేతకాదు. అతనిని సరిచేయడం మరొకరికి కూడా సాధ్యం
కాదు. కనుక, అహంకారిని సమాజం ప్రేమించదు. పరమాత్మ క్షమించడు.
స్వామి సుందర చైతన్యానంద
**************************************
ముకుంద నామముతో ముందుకు పోవడమే ఈనాడు మన
ముందున్న కార్యము. వెన్న ముద్దల గోపాలుడు మనకోసం
వేచియున్నాడు. ముందుకు వెళ్తే నీకొక ముద్ద.
అది మామూలు వెన్నముద్ద కాదు.
వెన్నుని అమృతహస్తముల నుండి నీవు అందుకో బోయేది
వెన్నముద్ద కాదు. మోక్షసుధ.
స్వామి సుందర చైతన్యానంద
************************************
తుకారాం సంకీర్తనను ప్రారంభంలో ఎవ్వరూ హర్షించలేదు.
తుకారాం నిరాశపడ్డాడు.
"నా సంకీర్తనను ఎవ్వరూ అలకించడం లేదు. ఇక నేను
చేయను. మానేస్తాను," అని పాండురంగనితో మొరపెట్టు కుంటాడు.
"తుకా! ఎవరు వినకపోతే ఏమైంది? వినేందుకు నేనున్నాగా?"
అంటాడు పాండురంగస్వామి. అంతే. తుకారాం శాంతిని
అనుభవించాడు.
తుకా మణే ఆతాఁ ఆనందీ ఆనంద్
గా ఊఁ పరమానంద్ మనా సంగే
"ఇక ఆనందమే. అంతా ఆనందమే. మనసులో నిన్ను
పరమానందంతో కీర్తిస్తాను" అని ఆనాటి నుండి పరవశిస్తూ
సంకీర్తన చేయసాగాడు తుకారాం.
ఆ తరువాత, ప్రపంచమంతా అతని సంకీర్తనమును పని
కట్టుకొని మరీ వినింది.
స్వామి సుందర చైతన్యానంద
***************************************
So long as God's grace does not
fall on you, you will not know its
greatness. And when His grace
falls on you, you will ask your-
self, "Do I deserve His Love?".
God's grace is not the result of
your effort or the reward for your
endeavours. It is a proof of His
infinite love for His children.
Swami Sundara Chaitanyananda
****************************************
Where there is moon there is moon light.
Where there is a king there is a kingdom.
Where there is grace there is righteousness.
Where there is a Guru there is Gyana.
Where there is gyana there every thing is.
************************************************
The richest among us is he who wants
nothing. A Viragi's life is therefore, the
grandest of all. He sleeps in a bower
with the green foliage shading him,
the blooming branches fanning him,
the flower-laden trees waiting on
him and the birds singing him a lullaby.
SWAMI SUNDARA CHAITANYANANDA
***************************************
మట్టిలో కూరుకు పోయినా మట్టి విత్తనము ఎలాగో పైకి
వచ్చి శాఖోపశాఖలతో మహా వృక్షమై విస్తరిస్తుంది.
బుద్ధిమంతులు తాత్కాలికంగా పతనమైనట్లు
కనిపించినా ప్రయత్నించి పైకి వచ్చి విశ్వరూపం ధరిస్తారు.
మంచిని ఎవరూ వంచించలేరు. పవిత్రతకు ప్రగతే గాని
పతనం తెలియదు.
స్వామి సుందర చైతన్యానంద
**************************************
ఒక వ్యక్తి మనల్ని నిందిస్తాడు. కారణం అతనిలో మనపై ద్వేషం
పుట్టిందని అర్థము.
కాని అతనిలో ద్వేషమున్నదని మనము గుర్తిస్తామే గాని అతనిలో
పుట్టిన ద్వేషం మనలో పెరుగుతున్నదని గుర్తించము. అలా
పెరిగే ద్వేషము మనలో ఎంతగా అశాంతిని పెంచుతుందో
కూడా ఊహించలేము.
మరొకరిలో ఉండే ద్వేషం వల్ల మనకు నష్టం లేదు. మనలో
ద్వేషం పెరిగినపుడే బ్రతుకు కల్లోల మవుతుంది.
స్వామి సుందర చైతన్యానంద
*************************************
సాధకుడు సహనశీలుడై ఉండాలి.
ధైర్యశాలిగా మెలగాలి.
నిరాశలకు ఆహ్వానం పలకకూడదు.
నిస్పృహలకు పీట వేయకూడదు.
ఉత్సాహంతో, తృప్తితో, విశ్వాసంతో సాధనలను
సాగించాలి. పరిపక్వత రానే వస్తుంది.
పరిపూర్ణత తప్పక పలకరిస్తుంది.
స్వామి సుందర చైతన్యానంద
*****************************************
సొంపైన మాటనిచ్చి ఇంపైన పాటనిచ్చి
మాట మల్లెల మాలకట్టెడి కవిత నిచ్చి
ఎన్నో ఇచ్చి బ్రతుకుకు వన్నె నిచ్చి
గాచితివని తృప్తిపడితి ఉన్న మనసెల్ల నీకిచ్చి.
స్వామి సుందర చైతన్యానంద
నమస్తే తెలంగాణ….. విద్యార్థి… నీ హక్కులేవీ? సల్వాజి మాధవరావ్ - 93916 73807
నమస్తే తెలంగాణ….. విద్యార్థి… నీ హక్కులేవీ? సల్వాజి మాధవరావ్ - 93916 73807 తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పోరాటాల పునాదులపై నిర్మితమైంది. 19...
-
I have updated(26-04-2012)the folder: except MBK – 75 Raga Vaibhavam – Vol 04.part2.rar this link is not working presently if anyone has the...
-
నమస్తే తెలంగాణ….. విద్యార్థి… నీ హక్కులేవీ? సల్వాజి మాధవరావ్ - 93916 73807 తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పోరాటాల పునాదులపై నిర్మితమైంది. 19...
-
మానవాభ్యున్నతికి సహృదయత కావాలి. సదస్సులు కావు. భారతీయ హృదయం పాశ్చాత్య మేధస్సును స్పృశించాలి. అప్పుడే యుద్ధాలు అదృశ్యమవుతాయి. శాంతి నెలకొంటుం...