Tuesday, 5 May 2026

links

Internet Archive Org. @sudarshan_reddy330 

https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda

videos:https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda&page=8&and%5B%5D=mediatype%3A%22movies%22


books:https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda&and%5B%5D=mediatype%3A%22texts%22


audios: https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda&and%5B%5D=mediatype%3A%22audio%22

*****************************************************************************


total 183 files: https://archive.org/details/@sundarachitanyam_ysreddy

144 files: https://archive.org/details/@sundarachitanyam_ysreddy?query=swami+sundara+chaitanyananda

133 videos: https://archive.org/details/@sundarachitanyam_ysreddy?query=swami+sundara+chaitanyananda&and%5B%5D=mediatype%3A%22movies%22

7 files audios: https://archive.org/details/@sundarachitanyam_ysreddy?query=swami+sundara+chaitanyananda&and%5B%5D=mediatype%3A%22audio%22

*******************************************************

చైతన్య చేమంతులు#swami_sundara_chaitanyananda

https://archive.org/details/20260331_572/page/n31/mode/2up


********************************************************************************

Lord Krishna#swamiji#Scaned Mini Photos - 40









Saturday, 21 February 2026

తెలంగాణ ఆత్మ – కేసీఆర్ - Prasad Kasula

 

తెలంగాణ ఆత్మ – కేసీఆర్ - Prasad Kasula

చరిత్రలో కొందరు వ్యక్తులు నాయకులు కాదు… వారు ఒక ఉద్యమం. ఒక జ్వాల. ఒక జాతి గౌరవానికి ప్రతిరూపం.

1952లో పొట్టి శ్రీరాములు గారు తెలుగు భాష కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయన శరీరం క్షీణించింది… కానీ ఆయన సంకల్పం రాష్ట్రాన్ని సృష్టించింది. ఆ త్యాగాన్ని మనం గౌరవంగా చదువుతాము… మనసారా నమ్ముతాము.

అదే విధంగా, తెలంగాణ కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. 

ఆయన కేవలం రాజకీయ నాయకుడు కాదు — తెలంగాణ గుండె చప్పుడు. ఆయన దీక్ష కేవలం ఆహారాన్ని త్యజించడం కాదు… అది ఒక జాతి ఆత్మగౌరవం కోసం చేసిన అగ్నిప్రమాణం.

ఆయన స్వరం ఢిల్లీ గోడలను తాకింది. ఆయన సంకల్పం లక్షల మంది యువతలో జ్వాలగా మారింది. విద్యార్థుల అరుపులు, ఉద్యోగుల సమ్మెలు, ప్రజల కన్నీళ్లు—all ఒకే దిశగా కదిలేలా చేసిన శక్తి ఆయన నాయకత్వం.

2014లో తెలంగాణ అవతరించింది. ఆ రోజు కేవలం ఒక కొత్త రాష్ట్రం పుట్టలేదు… అది ఒక జాతి గర్వం తిరిగి పుట్టిన రోజు.

కాలం మారుతుంది… విమర్శలు వస్తాయి… కీర్తిని చెరిపివేయాలనే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ చరిత్రలో రక్తంతో రాసిన పేర్లు ఎప్పటికీ చెరిగిపోవు. తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు ప్రజల గుండెల్లో ఉంటుంది.

“తెలంగాణ రాష్ట్ర నాయకుడు” అని పలికిన ప్రతిసారి,

“తెలంగాణ రాష్ట్ర ప్రజలు” అని సంభోదించిన ప్రతిసారి,

ఆ ఉద్యమ స్పూర్తి… ఆ త్యాగం… ఆ నాయకత్వం గుర్తుకు వస్తూనే ఉంటుంది.

తెలంగాణ కేవలం ఒక భూభాగం కాదు — అది ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగానికి రూపం ఇచ్చిన ఉద్యమ శిఖరం కేసీఆర్ గారు.

ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ సేవ చేసే అవకాశాన్ని పొందాలి అని కోరుకోవడం ప్రతి అభిమాని హక్కు.

చరిత్ర తీర్పు ఒకటే — త్యాగం చేసినవారు నిలుస్తారు…

జాతి కోసం నిలిచినవారు చిరస్థాయిగా నిలుస్తారు.

జయహో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు 🙏

జై తెలంగాణ జయహో కేసీఆర్ గారు 🔥 - మీ ప్రసాద్ కాసుల ✍️



Wednesday, 18 February 2026

ఈ జీవితంలో మరిచిపోలేని రోజు

కేసీఆర్ సార్ జన్మదినం సందర్భంగా
ఎంతో మంది అభిమానుల మధ్యన
సాయంత్రం ఎర్రవల్లి నివాసంలో కలిశాను
అంత మందిని కలవడం సాధారణ విషయం కాదు
దాదాపుగా వచ్చిన వాళ్లందరినీ కలిసాడు
అనుకున్నంత సులభం అయితే కాదు!
నేను సార్ కి విష్ చేసి వెళ్తుండగా
అంత మందిలో కూడా నవీన్ ఆగు అని పిలిచి
కలుద్దామని లోపలికి వెళ్ళి కూర్చో అన్నాడు
అంతమందినీ కలుస్తూ కూడా
పలకరించి మాట్లాడటం సాధారణ విషయం కాదు!
అందుకేనేమో సార్ దాకా వెళ్లగలిగాను
ఒక చిన్న స్థానాన్ని సంపాదించగలిగాను
అది నాకు ఎంతో గర్వంగా ఉంది
ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను! ♥️😍🔥🔥✊✊
ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు
ఈ తరంలో పుట్టడం నా అదృష్టమే
జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన గొప్ప వ్యక్తికి
మరోసారి జన్మదిన శుభాకాంక్షలు! 💐💐😍♥️✊✊
Kallem Naveen Reddy

Saturday, 31 January 2026

'సిట్' పేరిట దాడి సిగ్గుచేటు - కళ్ళెం నవీన్ రెడ్డి - 9963691692

 'సిట్' పేరిట దాడి సిగ్గుచేటు

కళ్ళెం నవీన్ రెడ్డి - 9963691692

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి 

ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడం కేవలం వ్యక్తిపై కాదు.. తెలంగాణ ఉద్యమ గౌరవంపై చేసిన దాడి. దీనిని తెలంగాణ సమాజం తీవ్ర ఆవేదనతో సిగ్గుచేటు. చర్యగా ఖండిస్తున్నది. తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజాస్వామ్య విలువలపై గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆర్పై అక్రమ కేసులు, నోటీసుల పేరుతో జరుగుతున్న చర్చలు కాంగ్రెస్ పాలనలోని ఆరాచకాన్ని, పాలకుల అసహనాన్ని, రాజకీయ కక్ష సాధింపు చర్యలను స్పష్టంగా బయటపెడుతున్నాయి.

కేవలం ఒక వ్యక్తిపై దాడిగా చూడటమే కాదు. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రపై, ఆ ఉద్యమంలో భాగస్వాములైన లక్షలాది ప్రజల త్యాగాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా భావించవచ్చు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన రేవంత్ సర్కార్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతూ ఉద్యమ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తన పాలనలోని

అసమర్థతను, డొల్లతనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప మరొకటి కాదు. పాలనా వైఫల్యాలు, అమలు కాని హామీలు, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఎదుర్కోలేని పరిస్థితిలో ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు

దిగుతున్నదని చాలా స్పష్టంగా అర్థం అవుతున్నది. ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన పాలన, విచారణల పేరుతో రాజకీయ వేటకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు

 శ్రేయస్కరం కాదు. కేసుల పేరుతో ప్రతిపక్షాన్ని వేధించడం పాలకుల బలహీనతకు నిదర్శనం.

తెలంగాణ సాధన ఒక రాజకీయ అవకాశవాదం కాదు. అది ఒక తరం త్యాగాల ఫలితం. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన కేసీఆర్ పేరు చరిత్రలో ఒక వ్యక్తిగా మాత్రమే కాదు, ఒక ఆలోచనగా, ఒక ఉద్యమంగా, సిద్ధాంతంగా నిలిచిపోతుంది. అటువంటి నాయకుడిపై కక్షపూరిత

చర్యలకు, వేధింపులకు పాల్పడటం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవాన్ని

అవమానిస్తున్నదనే భావన, ఆగ్రహం ప్రజల్లో

బలంగా నెలకొన్నది.

కేసీఆర్ అనే ప్రజానాయకుడు పదవుల కోసం ఆరాటపడలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన పదవులను కూడా తృణప్రాయంగా విసిరి పారేసిన విషయాన్ని మననం చేసుకోవాలి. టీ ఆర్ఎస్ స్థాపన నుంచి రాష్ట్ర సాధన వరకు ఆయన చేసిన ప్రయాణం మహత్తర పోరాట ప్రస్థానం.

ప్రజల నుంచి పుట్టిన నాయకుడు కావడం వల్లే ఆయన బలం అధికారంలో కాదు, ప్రజల విశ్వాసంలో ఉన్నది. అందుకే కాంగ్రెస్ కక్షసాధింపు రాజకీయాలు ఆయనను బలహీనపరచలేవు.

చరిత్రను మరిచిపోవాలని, ఉద్యమాన్ని చిన్నచూపు చూడాలని ఎవరైనా యత్నిస్తే ప్రజాతీర్చు నుంచి తప్పించుకోలేరు. కుట్రలతో పాలన సాగించవచ్చు అని అనుకుంటే భ్రమ. తెలంగాణ

ఉద్యమ చరిత్ర, కేసీఆర్ నాయకత్వం ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయిన

సత్యాలు, కాంగ్రెస్ పాలకులు చరిత్రను గౌరవించకపోతే ప్రజాగ్రహం తప్పదు.


Saturday, 3 January 2026

మళ్ళీ ఎప్పటిలాగే

మళ్ళీ ఎప్పటిలాగే! 
మళ్ళీ ఎప్పటిలాగే ప్రతీ సంవత్సరం 
అనేక సంఘర్షణలను మోస్తూ 
మరో సంవత్సరానికి ఆహ్వానం 
పలుకుతూనే ఉన్నాను! 
జీవితంలో నేర్చుకోవాల్సిన అంశాలను, 
గమనించాల్సిన అంశాలను 
నా చుట్టూ ఉన్నటువంటి 
మనిషి తనపు అన్ని కోణాలను 
అద్దం లేకుండానే చూసే 
స్థాయికి నన్ను తీసుకెళ్లింది కాలం! 
నిత్యం జీవితాన్ని అందంగా చెక్కుకుంటూ 
ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు 
సిద్ధమై అనుకున్న లక్ష్యాల కోసం వ్యవస్ధలో 
మమేకమై ప్రయాణిస్తూనే ఉన్నాను! 
రానున్నవి మంచి రోజులు గడిచిన 
కాలంలోని అనుభవాలు 
నేర్పించిన గాయాలు, జ్ఞాపకాలు 
మాత్రమేనని ఇలాగే సాగుతూ ఉన్నాను! 
జీవితం అంటే సంతోషం కోసం పరుగెత్తడం కాదు 
బాధలో కూడా నిలబడగలగడం 
ఎన్నో ఏళ్లుగా ఇదే నేర్చుకున్నాను! 
గడిచిన కాలం నాకు మిగిల్చింది 
గాయాల్ని కాదు గాయాల్ని భరించే గొప్ప సామర్థ్యాన్ని…! 
గడిచిన కాలం నా నుండి వెంట తీసుకెళ్లింది కొన్ని గాయాలు, 
కొన్ని జ్ఞాపకాలు, కొన్ని మౌనాలు మాత్రమే.... 
అవి ఇక బాధ పెట్టవు ఎందుకంటే అవి నన్ను నిలబెట్టిన నా కథలే…! మళ్ళీ ఎప్పటిలాగే #byebye2025 - Kallem Naveen Reddy

నిందలు .. చిందులు.. కళ్ళెం నవీన్ రెడ్డి

నిందలు .. చిందులు.. కళ్ళెం నవీన్ రెడ్డి నమస్తే తెలంగాణ 01-01-2026 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరమే పాలనా దిశను నిర్ణయిస్తుంది. ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అమలుచే సిన విధానాలు, చూపిన పరిపాలనా శైలి ప్రజల నమ్మకానికి పునాది అవుతాయి. కానీ, తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్న పాలనా పరిస్థి తులను చూస్తే, సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ సమర్థ తపై ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. నిందలు.. చిందులు! కళ్ళెం నవీన్ రెడ్డి 99636 91692 రాష్ట ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన చిత్రాన్ని ప్రజలకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని వస్తున్న విమర్శలు సహేతుకమైనవే. అప్పులు, ఆదాయ వనరులు, ఖర్చుల ప్రాధాన్యాలు ఈ అంశాల్లో పారదర్శత కొరవడటం అనిశ్చితిని పెంచుతున్నది. సమస్యను గుర్తించడం ఒక దశ అయితే, దానికి సరైన కార్యాచరణ రూపొందించడం అసలు పరీక్ష, ఆ పరీక్షలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయిందని రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు. రైతాంగ సమస్యలు తెలంగాణకు మూలస్తంభం వంటివి. సాగునీరు, ఎరువులు, పెట్టుబడి సాయం, పంటలకు గిట్టుబాటు ధర రైతు జీవితానికి సంబంధించిన వాస్తవాలు. అయితే రైతు సమస్యలపై తీసుకున్న చర్యలు తాత్కాలికంగా కనిపిస్తున్నాయి తప్ప, దీర్ఘకాలిక పరిష్కారాలుగా మారలేకపోతున్నాయి. నిరుద్యోగ యువత పరిస్థితి మరింత అందోళన కలిగిస్తున్నది. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఉద్యో గాల భర్తీపై ఇచ్చిన హామీలుగానే ఇచ్చినట్టే ఉన్నాయి. ప్రకటనల కోసం యువత ఎదిరిచూస్తున్నది. ఈ పరిస్థితిలో పాలనపై ప్రజల్లో నమ్మకం దెబ్బ తిన్నది. పరిపాలనలో స్థిరత్వం కూడా ఒక కీలక అంశం. తరచూ మారుతున్న ప్రకటనలు, విభిన్న వ్యాఖ్యలు, ఒకదానికొకటి పొంతన లేని నిర్ణయాలు ప్రభుత్వ దిశపై సందేహాలు కలిగిస్తున్నాయి. విమర్శలకు సమాధానంగా విమ ర్శలే చేయడం పాలనకు ప్రత్యామ్నాయం కాదు. ప్రజలు కోరేది స్పష్టమైన విధానం, స్థిరమైన నిర్ణయాలు. కానీ ప్రభుత్వం ఈ సోయి మరిచిపోయి వ్యవ హరిస్తున్నది. నాయకత్వం అంటే సమస్యలకు ఇతరులపై నిందలు వేయడం, చిందులు వేయడం కాదు, బాధ్యతగా వ్యవహరించడం. గత ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తూ కాలం గడిపితే వర్తమాన సమస్యలకు పరిష్కారం దొర కదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతుల దూకుడు తగ్గించుకొని, పాలనలోని లోతులను తెలుసుకోవాలి. సమర్థతను కార్యాచరణ ద్వారా నిరూపించుకోవాలి. పనిలో నిమగ్నమైనప్పుడే బూతు మాటలు నోటి నుంచి రాకుండా ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే.. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏ ప్రకటన చేస్తాడో అని ప్రజలు వేచిచూసే సమయం రావాలి. అది రేవంత్ జీవితంలో సాధ్యమయ్యే పనికాదు.

links

Internet Archive Org. @sudarshan_reddy330   https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda videos: http...