Saturday, 3 January 2026

మళ్ళీ ఎప్పటిలాగే

మళ్ళీ ఎప్పటిలాగే! 
మళ్ళీ ఎప్పటిలాగే ప్రతీ సంవత్సరం 
అనేక సంఘర్షణలను మోస్తూ 
మరో సంవత్సరానికి ఆహ్వానం 
పలుకుతూనే ఉన్నాను! 
జీవితంలో నేర్చుకోవాల్సిన అంశాలను, 
గమనించాల్సిన అంశాలను 
నా చుట్టూ ఉన్నటువంటి 
మనిషి తనపు అన్ని కోణాలను 
అద్దం లేకుండానే చూసే 
స్థాయికి నన్ను తీసుకెళ్లింది కాలం! 
నిత్యం జీవితాన్ని అందంగా చెక్కుకుంటూ 
ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు 
సిద్ధమై అనుకున్న లక్ష్యాల కోసం వ్యవస్ధలో 
మమేకమై ప్రయాణిస్తూనే ఉన్నాను! 
రానున్నవి మంచి రోజులు గడిచిన 
కాలంలోని అనుభవాలు 
నేర్పించిన గాయాలు, జ్ఞాపకాలు 
మాత్రమేనని ఇలాగే సాగుతూ ఉన్నాను! 
జీవితం అంటే సంతోషం కోసం పరుగెత్తడం కాదు 
బాధలో కూడా నిలబడగలగడం 
ఎన్నో ఏళ్లుగా ఇదే నేర్చుకున్నాను! 
గడిచిన కాలం నాకు మిగిల్చింది 
గాయాల్ని కాదు గాయాల్ని భరించే గొప్ప సామర్థ్యాన్ని…! 
గడిచిన కాలం నా నుండి వెంట తీసుకెళ్లింది కొన్ని గాయాలు, 
కొన్ని జ్ఞాపకాలు, కొన్ని మౌనాలు మాత్రమే.... 
అవి ఇక బాధ పెట్టవు ఎందుకంటే అవి నన్ను నిలబెట్టిన నా కథలే…! మళ్ళీ ఎప్పటిలాగే #byebye2025 - Kallem Naveen Reddy

No comments:

Post a Comment

మళ్ళీ ఎప్పటిలాగే

మళ్ళీ ఎప్పటిలాగే!  మళ్ళీ ఎప్పటిలాగే ప్రతీ సంవత్సరం  అనేక సంఘర్షణలను మోస్తూ  మరో సంవత్సరానికి ఆహ్వానం  పలుకుతూనే ఉన్నాను!  జీవితంలో నేర్చుక...