Saturday, 3 January 2026

నిందలు .. చిందులు.. కళ్ళెం నవీన్ రెడ్డి

నిందలు .. చిందులు.. కళ్ళెం నవీన్ రెడ్డి నమస్తే తెలంగాణ 01-01-2026 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరమే పాలనా దిశను నిర్ణయిస్తుంది. ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అమలుచే సిన విధానాలు, చూపిన పరిపాలనా శైలి ప్రజల నమ్మకానికి పునాది అవుతాయి. కానీ, తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్న పాలనా పరిస్థి తులను చూస్తే, సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ సమర్థ తపై ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. నిందలు.. చిందులు! కళ్ళెం నవీన్ రెడ్డి 99636 91692 రాష్ట ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన చిత్రాన్ని ప్రజలకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని వస్తున్న విమర్శలు సహేతుకమైనవే. అప్పులు, ఆదాయ వనరులు, ఖర్చుల ప్రాధాన్యాలు ఈ అంశాల్లో పారదర్శత కొరవడటం అనిశ్చితిని పెంచుతున్నది. సమస్యను గుర్తించడం ఒక దశ అయితే, దానికి సరైన కార్యాచరణ రూపొందించడం అసలు పరీక్ష, ఆ పరీక్షలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయిందని రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు. రైతాంగ సమస్యలు తెలంగాణకు మూలస్తంభం వంటివి. సాగునీరు, ఎరువులు, పెట్టుబడి సాయం, పంటలకు గిట్టుబాటు ధర రైతు జీవితానికి సంబంధించిన వాస్తవాలు. అయితే రైతు సమస్యలపై తీసుకున్న చర్యలు తాత్కాలికంగా కనిపిస్తున్నాయి తప్ప, దీర్ఘకాలిక పరిష్కారాలుగా మారలేకపోతున్నాయి. నిరుద్యోగ యువత పరిస్థితి మరింత అందోళన కలిగిస్తున్నది. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఉద్యో గాల భర్తీపై ఇచ్చిన హామీలుగానే ఇచ్చినట్టే ఉన్నాయి. ప్రకటనల కోసం యువత ఎదిరిచూస్తున్నది. ఈ పరిస్థితిలో పాలనపై ప్రజల్లో నమ్మకం దెబ్బ తిన్నది. పరిపాలనలో స్థిరత్వం కూడా ఒక కీలక అంశం. తరచూ మారుతున్న ప్రకటనలు, విభిన్న వ్యాఖ్యలు, ఒకదానికొకటి పొంతన లేని నిర్ణయాలు ప్రభుత్వ దిశపై సందేహాలు కలిగిస్తున్నాయి. విమర్శలకు సమాధానంగా విమ ర్శలే చేయడం పాలనకు ప్రత్యామ్నాయం కాదు. ప్రజలు కోరేది స్పష్టమైన విధానం, స్థిరమైన నిర్ణయాలు. కానీ ప్రభుత్వం ఈ సోయి మరిచిపోయి వ్యవ హరిస్తున్నది. నాయకత్వం అంటే సమస్యలకు ఇతరులపై నిందలు వేయడం, చిందులు వేయడం కాదు, బాధ్యతగా వ్యవహరించడం. గత ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తూ కాలం గడిపితే వర్తమాన సమస్యలకు పరిష్కారం దొర కదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతుల దూకుడు తగ్గించుకొని, పాలనలోని లోతులను తెలుసుకోవాలి. సమర్థతను కార్యాచరణ ద్వారా నిరూపించుకోవాలి. పనిలో నిమగ్నమైనప్పుడే బూతు మాటలు నోటి నుంచి రాకుండా ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే.. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏ ప్రకటన చేస్తాడో అని ప్రజలు వేచిచూసే సమయం రావాలి. అది రేవంత్ జీవితంలో సాధ్యమయ్యే పనికాదు.

No comments:

Post a Comment

మళ్ళీ ఎప్పటిలాగే

మళ్ళీ ఎప్పటిలాగే!  మళ్ళీ ఎప్పటిలాగే ప్రతీ సంవత్సరం  అనేక సంఘర్షణలను మోస్తూ  మరో సంవత్సరానికి ఆహ్వానం  పలుకుతూనే ఉన్నాను!  జీవితంలో నేర్చుక...