Monday, 15 December 2025

నేను మాత్రమే కాదు

 

నేను మాత్రమే కాదు నాలాంటి వాళ్ళెందరో బీఆర్ఎస్

అనే కుటుంబాన్ని నమ్ముకుని బతుకే అర్పించినవాళ్లం

మీ మీ స్వార్థ ప్రయోజనాల కోసం

మాలాంటి వాళ్ళను ఆగం చేయకండి!

చేతుల్లో జెండా పట్టుకున్నాం

గుండెల్లో తెలంగాణను నిలుపుకున్నాం

అవమానాలు ఎదురైనా

వెనుదిరగని వాళ్ళం

రాత్రులు మాకెన్నో నిద్రలేకుండా గడిచాయి

ఇళ్లలోకాదు ఆశల అగ్నిలోనే మేము పెరిగాం

బీఆర్ఎస్ కూలిపోతుందంటూ

కలలు కంటున్నవాళ్లకు

ఒక్కటే సమాధానం

త్యాగాల చరిత్రకు

పతనం ఉండదు!

మా పార్టీ ఓ భవనం కాదు

కూల్చడానికి

అది ఓ భావజాలం

చెరిపేయడానికి వీలుకాదు

ప్రతి కార్యకర్త గుండెల్లో

ఒక ఉద్యమం బతుకుతోంది

ఆ ఉద్యమాన్ని

నాశనం చేయాలని కోరుకోవడమే

వాళ్ల జీవితంలో నెరవేరని

అతిపెద్ద పగటి కల!

తెలంగాణ శ్వాస ఉన్నంతవరకు

బీఆర్ఎస్ స్ఫూర్తి ఆగదు

పోరాటం ఆగదు

చరిత్ర ముందుకు నడుస్తూనే ఉంటుంది!

ఎందుకంటే

త్యాగాల మీద నిలిచిన పార్టీని

కక్షలతో కూల్చలేరు

ప్రజల గుండెల్లో నాటుకున్న వృక్షాన్ని

విషపు మాటలతో ఎండబెట్టలేరు!

- Kallem Naveen Reddy

No comments:

Post a Comment

నేను మాత్రమే కాదు

  నేను మాత్రమే కాదు నాలాంటి వాళ్ళెందరో బీఆర్ఎస్ అనే కుటుంబాన్ని నమ్ముకుని బతుకే అర్పించినవాళ్లం మీ మీ స్వార్థ ప్రయోజనాల కోసం మాలాంటి వాళ్ళను...