Sunday, 12 October 2025

మౌనమూ శబ్దమూ!

మౌనమూ శబ్దమూ! మీ శబ్దాలన్ని మౌనాలౌతాయి కాల గమనం వాటిని మింగేస్తుంది మీ శబ్దాలన్ని శూన్యాలౌతాయి ఆత్మరహిత ప్రతిధ్వనులై మిగిలిపోతాయి మా మౌనాలన్ని శబ్దాలౌతాయి మనసు లోతుల్లో పెల్లుబికే పిడుగులవుతాయి మా మౌనాలన్ని ప్రకాశిస్తాయి నిజం రూపంలో వెలుగులు పూస్తాయి అనేక సందర్భాలలో నిశ్శబ్దమే మా భాష అది మాటల కంటే గంభీరమైన స్వరం అది కాలం చెరపలేని సత్యమై నిలుస్తుంది! Kallem Naveen Reddy

No comments:

Post a Comment

మౌనమూ శబ్దమూ!

మౌనమూ శబ్దమూ! మీ శబ్దాలన్ని మౌనాలౌతాయి కాల గమనం వాటిని మింగేస్తుంది మీ శబ్దాలన్ని శూన్యాలౌతాయి ఆత్మరహిత ప్రతిధ్వనులై మిగిలిపోతాయి మా మౌ...