మనల్ని చాలామంది
చాలా సింపుల్‌గా అనుకుంటారు
లెక్కలోకి కూడా తీసుకోవడానికి
వాళ్ళ వ్యక్తిత్వం సరిపోదు
అది మన బలాన్ని
అంచనా వేయలేని
వాళ్ల పరిమితి మాత్రమే!
మనం ఎంత దూరం వెళ్లామో
ఎన్ని అగ్నిగుండాలు దాటామో
ఎంత గొప్ప ప్రయాణం చేశామో
వాళ్ల కళ్లకు కనిపించిన
కనిపించనట్టు ఉంటారు
సింపుల్‌గా ఉండటమనేది
మన బలహీనత కాదు
అది మన లోతు
మన స్థాయి...!
నిశ్శబ్దంగా ఉండటం
మన అలవాటు
శబ్దం చేయకుండా
చరిత్ర రాయడం మన స్వభావం
ఎక్కడికెళ్లినా నేల వాసన మర్చిపోం
గెలిచినా వినయం విడిచిపోం
ఓడిపోయిన కుంగిపోం
ఇంకా బలంగా కొట్లాడుతాం!
మన ప్రయాణం మనకే తెలుసు
మన విలువ కాలానికే తెలుస్తుంది
మనం మాత్రం ఎప్పటిలాగే
సింపుల్‌గానే ముందుకు సాగుదాం!
No comments:
Post a Comment