Thursday, 19 June 2025
నవ్వుకు నాంది
నవ్వుకు నాంది
మనిషి ఎప్పుడూ నవ్వలేదు. కాని, నవ్వ గలిగే శక్తిని ఎప్పుడూ
కలిగి ఉన్నాడు. సదా ఆనందంగా మనిషి ఉండలేడు. కాని, ఆనందమే
సదా తన స్వరూపంగా కలిగి ఉన్నాడు. నవ్వు కాలానికి సంబంధించింది.
కాదు. ఆనందం కాల పరిధిలో లేదు. అది వ్యక్తి పైనే కేంద్రీకరింపబడి
ఉంది.
సూర్యోదయ మయ్యే కాలముంది. తరువులు పల్లవించే కాల
ముంది. ఆకలయ్యే సమయ ముంది. నిద్రొచ్చే కాలముంది.
నవ్వేందుకు, ఆనందంగా ఉండేందుకు కాల ముందా? సంతోష మనేది
కాలాధీనమా? మనిషి ఎప్పుడు నవ్వుతాడో, ఏ కాలంలో నవ్వుతాడో
ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అంటే దాని అర్థ మేమిటి? ఎప్పుడైనా
నవ్వగలడు. అంతే కదూ? ఎప్పుడైనా నవ్వగలిగే శక్తి గల మానవుడు,
ఎప్పుడూ నవ్వలేక పోవడానికి, ఎప్పుడో గాని నవ్వడానికి హేతువేమిటి?
'నవ్వుతూ జీవించాలి' అనేది ఒక సందేశమా? ఎవరైనా
ఏదుస్తూ బ్రతకాలని అనుకుంటున్నారా? అందరూ నవ్వుతూ జీవించాలి.
అనే భావిస్తున్నారు. ఆనందంగా బ్రతకాలనే అభిలషిస్తున్నారు. కాని,
ఎందుకనో అలా జీవించలేక పోతున్నారు.
అలా జీవించలేక పోవడానికి ఏదో కారణం, లేదా కారణాలు
ఉన్నాయి. అవరోధాలు ఉన్నాయి. ప్రతిబంధకాలు ఉన్నాయి. ఏమిటవి?
అవి అర్ధం కావాలి. వాటిని అధిగమించే దెలాగో తెలిసి రావాలి.
ఈ విషయాలను చర్చించడానికి గురుపూర్ణిమ సందర్భముగా .
హైదరాబాద్ - సుందర చైతన్యాశ్రమంలో నిర్వహించిన సదస్సులో
నేను ప్రసంగించిన నాలుగు ప్రవచనముల సంకలనమే 'నవ్వుతూ
జీవించాలి' అనే ఈ పొత్తము.
ఈ పుస్తకము మూర్తిలో చిన్నదే. స్ఫూర్తిని కలిగించడంలో
దీప్తిమంతంగా ఉందని నా భావన. చదవండి. మీకే తెలుస్తుంది.
16-7-2012
స్వామి సుందర చైతన్యానంద
Subscribe to:
Post Comments (Atom)
links
https://archive.org/details/@sudarshan_reddy330 https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+sundara+chaitanyananda videos:...
-
నేను మాత్రమే కాదు నాలాంటి వాళ్ళెందరో బీఆర్ఎస్ అనే కుటుంబాన్ని నమ్ముకుని బతుకే అర్పించినవాళ్లం మీ మీ స్వార్థ ప్రయోజనాల కోసం మాలాంటి వాళ్ళను...
-
మౌనమూ శబ్దమూ! మీ శబ్దాలన్ని మౌనాలౌతాయి కాల గమనం వాటిని మింగేస్తుంది మీ శబ్దాలన్ని శూన్యాలౌతాయి ఆత్మరహిత ప్రతిధ్వనులై మిగిలిపోతాయి మా మౌ...
No comments:
Post a Comment