Sunday, 16 May 2021

కృష్ణం వందే జగద్గురుం - నామ సంకీర్తన : శ్రీ గరిమెళ్ళ బాలకృ ష్ణ ప్రసాద్ బ...

కృష్ణం వందే జగద్గురుం | శ్రీ కృష్ణం వందే జగద్గురుం ||

శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ ! శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ |

శ్రితజనపాలక కృష్ణ కృష్ణ | శ్రీపతి రమణ కృష్ణ కృష్ణ || కృష్ణం వందే||

సామజగమన కృష్ణ కృష్ణ ! సామజవరద కృష్ణ కృష్ణ |

సాధుజనావన కృష్ణ కృష్ణ | సారసలోచన కృష్ణ కృష్ణ|| కృష్ణం వందే||

కరుణాలోల కృష్ణ కృష్ణ | కరిరాజవరద కృష్ణ కృష్ణ

కమనీయానన కృష్ణ కృష్ణ | కంసవిదార కృష్ణ కృష్ణ|| కృష్ణం వందే||

పురాణపురుష కృష్ణ కృష్ణ ! పుణ్యవిహార కృష్ణ కృష్ణ |

పూతనాదిహర కృష్ణ కృష్ణ | పుండరీకాక్ష కృష్ణ కృష్ణ || కృష్ణం వందే||

మంగళగాత్ర కృష్ణ కృష్ణ | మదనగోపాల కృష్ణ కృష్ణ |

మందర గిరిధర కృష్ణ కృష్ణ | మధుసూదన శ్రీ కృష్ణ కృష్ణ || కృష్ణం వందే||

సహస్రనామ కృష్ణ కృష్ణ | సంస్తుత నామ కృష్ణ కృష్ణ |

సంగీతలోల కృష్ణ కృష్ణ | సమానరహిత కృష్ణ కృష్ణ || కృష్ణం వందే||

వేదరక్షక కృష్ణ కృష్ణ | వేదస్వరూప కృష్ణ కృష్ణ |

విజయసారధి కృష్ణ కృష్ణ | వరగుణజాల కృష్ణ కృష్ణ || కృష్ణం వందే ||

గగన శ్యామ కృష్ణ కృష్ణ | ఘనరిపుభౌమ కృష్ణ కృష్ణ,

గోకులప్రియ కృష్ణ కృష్ణ | గరుడ వాహన కృష్ణ కృష్ణ || కృష్ణం వందే ||

మురళీ మోహన కృష్ణ కృష్ణ | మునిజనపాల కృష్ణ కృష్ణ |

ముచుకుంద వరద కృష్ణ కృష్ణ | ముక్తి దాయక కృష్ణ కృష్ణ || కృష్ణం వందే ||

కుండలి శయన కృష్ణ కృష్ణ | కుమతి నివారణ కృష్ణ కృష్ణ !

రాసవిహారి కృష్ణ కృష్ణ | రాధాలోల కృష్ణ కృష్ణ || కృష్ణం వందే ||

అనంతరూప కృష్ణ కృష్ణ | అనంత మహిమ కృష్ణ కృష్ణ !

అనంతవీర్య కృష్ణ కృష్ణ | అక్షరాకృతి కృష్ణ కృష్ణ || కృష్ణం వందే ||

నవమహిమార్ణవ కృష్ణ కృష్ణ | నమితామర శ్రీ కృష్ణ కృష్ణ |

నరకనాశన కృష్ణ కృష్ణ | నవనీతచోర కృష్ణ కృష్ణ || కృష్ణం వందే ||

పంకజనాభ కృష్ణ కృష్ణ | పరమానంద కృష్ణ కృష్ణ |

పాతకనాశన కృష్ణ కృష్ణ | పాశమోచన కృష్ణ కృష్ణ || కృష్ణం వందే ||

ధర్మపాలన కృష్ణ కృష్ణ | ధరణి వల్లభ కృష్ణ కృష్ణ |

ద్వారకాధీశ కృష్ణ కృష్ణ | దానవ మర్ధన కృష్ణ కృష్ణ || కృష్ణం వందే ||

నిగమగోచర కృష్ణ కృష్ణ | నిత్య నిర్మల కృష్ణ కృష్ణ

నిఖిలలోకేశ కృష్ణ కృష్ణ | నిరామయ దేవ కృష్ణ కృష్ణ || కృష్ణం వందే ||

శ్రీ వేంకటేశ కృష్ణ కృష్ణ | శ్రీ గౌరీనుత కృష్ణ కృష్ణ |

శ్రీకర గుణనిధి కృష్ణ కృష్ణ | శ్రీ విష్ణురూప కృష్ణ కృష్ణ || కృష్ణం వందే ||


No comments:

Post a Comment