Sunday 16 May 2021

శుభం కల్గుగాక - నిత్య సత్యాలు

శుభం కలుగు గాక
వచ్చేవి పోయేవి మూడు

1. పేదరికం 2. వ్యాధి 3. డబ్బు

వచ్చినా వదిలి పోనివి మూడు
1.
కీర్తి 2. జ్ఞానం 3.విద్య

పోతే రానివి మూడు
1.
కాలం 2.యవ్వనం 3.పరువు

వెంటనే వచ్చేవి మూడు

1.పాపం 2.పుణ్యం 3.నీడ

సోమరితనం రాచపుండు
లాంటిది ఒకసారి అది
వచ్చిందంటే ఆ రోగి ఇక
యెన్నటికి బాగుపడలేడు
పువ్వు యెంత అందంగా
వున్నా పరిమళం
లేకపోతే వ్యర్థమే
క్రియాశూన్యమైన
మాటలు వినసొంపుగా
వున్నా నిభ్రయోజనమే
కోపంగా వుండడం అంటే
నిప్పును పట్టుకోవడమే
యెదుటి వాల్ల మీదకు
విసిరే లోపల అది నిన్నే
దహించి వేస్తుంది.
ఆలస్యం చెయ్యడం వల్ల
సులభమైన పని
కష్టతరమౌతుంది కష్టమైన
పని ఆసాధ్యమౌతుంది.

చిన్న పొరపాటే కదా అని
నిర్లక్స్యం తగదు పెద్ద
ఓడను ముంచేయటానికి
చిన్న రంధ్రం చాలు
దీపం తాను వెలుగుతూ
వుంటే తప్ప మరో దీపాన్ని
వెలిగించలేదు


No comments:

Post a Comment