Wednesday, 23 April 2025
మంచిమాటలు 803 to 876
మంచిమాటలు 803 to 876
803. ఏ మతం చెప్పినా - మత గ్రంధాలు చెప్పినా
పరోపకారముతో - పుణ్యము చేకూరును
పర పీడనతో - పాపము చేకూరును
పాపాన్ని - పాతిపెట్టు
పుణ్యాన్ని - చేర్చిపెట్టు
అందుకు ఇప్పుడే - నడుం కట్టు
804. తల్లి లాంటి - శిక్షణ
తండ్రి లాంటి - రక్షణ..
ఇదే అందరి - సంఘర్షణ
805. దేహమే ఒక - కారు
కన్నులు - హెడ్ లైట్లు
కడుపు - పెట్రోలు ట్యాంకు
నోరు - హారన్
మనస్సు - స్టీరింగ్
ధర్మ, అర్థ, కామ, మోక్షాలు - టైర్లు
విశ్వాసమే - వాటి గాలి
బుద్ధియే - స్విచ్చు
ఇంద్రియ నిగ్రహమే - బ్రేకు
తద్వారా - చిత్తశుద్ధి
చిత్తశుద్ధి వలన - జ్ఞాన సిద్ధి
జ్ఞాన సిద్ధి వలన - మోక్ష ప్రాప్తి
806. దేవుళ్ళందు భేదాలు - వద్దురా
దేవుళ్ళంతా - ఒకటేరా
807. మడి మడి అని - అరవకురా
మంచి గుణాలే - మడి బట్టలురా!
808. చెడు ఆలోచనలతో - చెడిపోవద్దు.
మంచి ఆలోచనలతో - మంచి మనిషిగా బ్రతుకు
శక్తి కంటే - యుక్తి గొప్ప అని తెలుసుకో
లోకం తీరు
809. ఒకడు - సిగిరెట్టు త్రాగుట వలన క్షయ వస్తుంది.
మరొకడు - ఎవరు చెప్పారు
ఒకడు పేపరులో చదివాను
అయితే పేపరు చదవవద్దు అంటాడు
అంతేకాని దురలవాటు మానడు ఇది లోకం తీరు
810. ఆకలి తీర్చుట - మొదటి పని
భోధనలు చేయుట - ఆవలి పని
811. వారం వారం - ఉపవాసం
ఆరోగ్యంతో - సహవాసం
82. దానమందు నిదానము పనికి రాదు
దానము చేయుట పుణ్యము ఖాతాలో
పిక్స్డ్ డిపాజిట్ చేయుట వంటిది
813. ఐశ్వర్యము కంటే ముఖ్యము ఆరోగ్యం
ఆరోగ్యం లేని ఐశ్వర్యము వ్యర్థము
84. రేపునకు రూపు లేదు
మంచి పనులు వాయిదా వేయకు
815. దేవుని కొరకు ప్రయత్నించుట - యోగము
భోగము కొరకు ప్రయత్నించుట - రోగము
816. తన్ను తాను విమర్శించు కొనుట - వివేకము
ఇతరులను విమర్శించు కొనుట - అవివేకము
817. నీవు ఇతరులకు చేసిన ఉపకారం - మరచిపొమ్ము
నీకు ఇతరులు చేసిన అపకారం - మరచిపొమ్ము
818. విశ్వాస పాత్రుడయిన - స్నేహితుడు
జీవితమునకు - ఔషధము వంటివాడు
819. దేహాన్ని అంటుకొన్నది మురికి - కొంత కాలం వరకే
వుంటుంది. మనస్సును అంటుకొన్న మలినం - మట్టిలో
కలిసేంతవరకు వుంటుంది, కావున మురికి అంటించుకోకు
820. విశ్వాసమును పోగొట్టుకొనుట
అన్ని నష్టముల లోను గొప్ప నష్టము
821. చిన్న అజాగ్రత్త వలన
పెద్ద కీడు కలుగ వచ్చును
822. అసలు తక్కువ - చేసి
ఆర్భాటం - ఎక్కువ చేయరాదు
823. అపకారం - అనర్థాలకు మూలం
ఉపకారం- ఉన్నతికి మూలం
824. హింసను విడనాడు - అహింసను పాటించు
825. సృష్టిని మార్చలేవు - దృష్టిని మార్చుకో
826. గత జన్మలో మనము ఇతరులకిచ్చిన వానినే
ఈ జన్మలో మనము అనుభవించు చున్నాము
827. హితముగను మితముగను మాట్లాడుము
మంచి పనులు మాత్రము అధికముగ చేయుము
అమితముగ మాట్లాడి అందరిని విసిగించకు
828. రేపు నకు రూపు లేదు
829. లోగడ చేసిన పుణ్యము యొక్క డిపాజిట్
నేడు అనుభవిస్తున్నాం
ఇప్పుడు చేసిన పుణ్యము యొక్క డిపాజిట్
భవిష్యత్తుకు ఉపయోగం
830. విశ్వాస పాత్రుడగు స్నేహితుడు
జీవితమునకు ఔషధము వంటివాడు
831. రైలులో కూర్చొని లగేజి నెత్తిన పెట్టుకొని
నా లగేజి నేనే మోస్తున్నానన్నాడు ఒక పెద్ద మనిషి
అలాగే ఈ ప్రపంచాన్ని నేనే నడిపిస్తున్నానని
నా వల్లె తెల్లవారుతుందని విర్రవీగే వీరులు కూడ వున్నారు
832. ఈగ సూట్కేసులో జొరబడి వీసా, టికెట్ రెండూ
లేకుండా అమెరికా వెళ్ళిందట. మనముకూడ దైవమునాశ్ర
యించి దైవానుగ్రహం పొందిన మోక్షధామం చేరవచ్చును
833. సంపన్నుడయిన మూర్ఖుడు
సమాజానికి ముప్పు (సరిపడడు)
834. పరమాత్మ సాన్నిధ్యమే - పరమానందం దం
835. భక్తుని హృదయము - భగవంతుని మందిరం
836. నలుపు, తెలుపు దూరదర్శన్ (B & W. T.V.)లో కలర్
బొమ్మలు రానట్లే కఠినాత్ముని హృదయంలో కారుణ్యము జనించదు
837. మానవుని సేవయే - మాధవ సేవ
జనుల సేవయే - జనార్థనుని సేవ
నరుల సేవయే - నారాయణుని సేవ
839. నవ్వించండి - కవ్వించకండి
నవ్వుల పాలు - కానివ్వకండి
840. ఇనుమును చెడగొట్టేది చిలుము (తుప్పు)
మనిషిని మనస్సును చెడగొట్టేది దుర్గుణాలు
కావున దుర్గుణాలకు దూరంగా ఉండాలి
841. సదాచరము సత్ ప్రవర్తన
సమాజమునకు సదా అవసరము
842. పట్టుబట్టలకు ప్రాకులాడుటకంటే
పరప్రాణికి మేలు చేయుటకు ప్రాకులాడుము
843. నిన్ను రక్షించుకునేందుకు - ఇతరులపై నింద వేయకు
కాలానికి నిరూపించే శక్తి - వుందని మరువకు
844. మంచి విషయాలు - వినిపించుకోని వాడే
నిజమైన చెవిటి వాడు
845. కష్ట, నష్టాలను చూచి - పారిపోరాదు
కష్ట నష్టాలు పరికలే కాని - జీవితానికి అంతాలు కావు
కష్ట నష్టాలనే - వరిపిడి రాయిద్వారా
మానవుని వ్యక్తిత్వం - విశదమగుతుంది
846. వడ్లు రోకలి దెబ్బలకు - బియ్యమగునట్లు
బంగారం కాగితే - మేలిమి బంగారమైనట్లు
మనిషి కష్ట నష్టాలతో - నలిగినకో (కరిగినచో)
మంచి మనిషిగ మారగలడు
847. పూజించుము, జపించుము - శక్తి కొలది సహకరించుము
శక్తి వుంది - సహకరించకపోతివా!
పూజల ఫలితం - పోగొట్టు కున్నట్లే
848. నీ సమక్షమున - పొగడువాడు
నీ పరోక్షమున - నిందించడని గ్యారంటి లేదు
849. పొగడ్త - పన్నీరు వంటిది
వాసన చూచి - వదిలి వేయాలి
త్రాగుటకు - పనికి రాదని గ్రహించాలి
850. బ్రతకటం - గొప్పకాదు
బ్రతుకంటే - ఏమిటో తెలుసుకొని బ్రతుకుట గొప్ప
851. క్రింద పడని వాని కంటే - పడి లేచిన వాడు గొప్ప
ఎందుకంటే - అతను గోతులు చూచాడు
852. యదార్థం అనే పదార్థం - విలువైనది
యదార్థం అను దానిని - అభివృద్ధిలోనికి తెస్తాం
యదార్థానికి విలువను - పెంచుదాం
853. ప్రజలను మళ్ళించడం - తేలికే
వారిని నడిపించడం - కష్టం
854. ప్రేమించిన వానిని - ప్రేమించుటలో లేదు గొప్ప
దూషించిన వానిని - ప్రేమించి చూడు
కీడు చేసినా వాడికి - మేలు చేసి చూడు
అందులోనే వుంది నీకు - దైవము తోడు
855. సంపదలో కొంత - దాన ధర్మాలకు కేటాయించుము
ఆకలి గొన్న వానికి - అన్నము పెట్టుము
వస్త్రము లేని వానికి - వస్త్రము అందించుము
నీ సంపదకు - సార్థకత చేకూర్చుము
ఇట్టి దేవునకు - ఇష్టమైనదిగా భావించుము
856. పక్షి ఎగురుటకు - రెండు రెక్కలు అవసరం
మనషి అభివృద్ధికి - జ్ఞానం, కర్మలు రెండు అవసరం
857. కష్ట సమయములో - మిత్రుడెవరో తెలిసిపోతుంది
యద్ధ సమయములో - శూరులెవరో తెలిసిపోతుంది
858. తాను పాతిపెట్టిన ధనాన్ని - తానే కనుగొనలేక వెతుకు చున్నట్లే
భగవంతుని తనలో ఉంచుకొని - అజ్ఞాని ఎక్కడెక్కడో
వెతుకు తున్నాడు.
859. అహం భావం తొలిగితే - దైవ భావం మిగులుతుంది
దైవ భావమే అన్ని మతాల - ఆశయం, సదాశయం
860. తన ఇంద్రియాలను - జయించిన వాడు
ప్రపంచమును - శాసించగలడు
861. వక్ర మార్గములో - పోవద్దు
సక్రమార్గము - వదలవద్దు
862. అహంకారం - రాక్షస గుణం
నిరహంకారం - దైవ గుణం
దైవ గుణం - కలిగియుండు
దైవానుగ్రహం - నీకే యుండు
863. కాషాయ వస్త్రాలు - కట్టుకున్న నీవు
నీ మనస్సుకు - కల్మషాన్ని అంటించుకోకు
కల్మషము కలిగియుంటివా - కసాయి వాడితో సమానమని
తెలుసుకో
864. కొందరికి సమస్తం ఉంటాయి
సంతృప్తి మాత్రం - వుండదు
సంతృప్తి లేని వానికి - ఎన్ని వున్నా దండగే
865. భక్తి అంటే విలపించుట కాదు
యాచించటం అంతకంటే కాదు
తనను తాను - సమర్పించుకొనుట
ప్రతి వస్తువును - భగవన్మయంగ చూచుట
బాధలలోవున్న వానికి-శక్తివంచన లేకుండ సహకరించుట
866. అత్యాశ యనే సెగతో - నీవు సొమ్మసిల్లి పోతివా!
తృప్తి యనే చల్లటి ప్రదేశం - నీకు అవసరం
ఉన్నదానితో తృప్తి పడుము - లేని దానికి ఎగబడి ఏడ్చకు
867. మనం నవ్వితే - ప్రపంచమంతా నవ్వుతుంది
మనం ఏడిస్తే - మనము మాత్రమే ఏడవాలి
నవ్వులో - భాగానికి వస్తారు
ఏడుపులో - ఎవరు భాగము ఆసించరు
బాధలు పంచుకొను - భాగస్వాములు కావాలి మనకు
868. నీవు దానము చేసిన - ధనమే నీది
నీవు దాచుకున్న ధనం - నీది అనే గ్యారంటి లేదు
దానం చేయుము - నీ ఖాతాలో జమ చేసుకొనుము
869. అజ్ఞానం కంటే - గ్రంథ పఠనం మేలు
గ్రంథపఠనం కంటే - గ్రంథం కంఠస్థం మేలు
కంఠస్థం చేయుట కంటే - అర్థం చేసుకొనుట మేలు
అర్థం చేసుకున్న మంచి విషయాన్ని - అమలు పరచుట
అన్నిటి కంటే మేలు
870. శాంతి అనే - ఆయుధం సంపాదించు
అశాంతి అనే - శత్రువును జయించు
871. ధనము పోయినా - తిరిగి సంపాదించ వచ్చు
పోయిన కాలాన్ని - తిరిగి పొందలేము
మంచి పనులు - వాయిదా వేయకు
కాలయాపన - చేసి కాలాన్ని వృధా చేయకు
872. ఓటమి చూసి - క్రుంగి పోకు
ప్రతి ఓటమి - ఒక విజయ సంకేతమే అనుకో
అపజయాన్ని చూసి నిరుత్సాహ పడకు
ప్రయత్నం నుండి - జారు కోకు
ప్రయత్నించి - ఫలితం సాధించు
873. మీ గురించి చెడు చెప్పితే - బాధ పడకండి
మీ ప్రవర్తన ద్వారా - అతని పలుకులు
అసత్యాలని - ఋజువు చేయండి
మీ మంచి తనాన్ని - నిరూపించు కోండి
మీ మంచి తనమే మీకు - శ్రీరామ రక్ష అని తెలుసుకోండి
874. నిద్ర పట్టని వారికి రాత్రి ఎక్కువ - కాలం అనిపిస్తుంది
అలసి పోయిన వారికి మైలు దూరం - అమడ దూరంగ అనిపిస్తుంది.
జీవించటం తెలియని వానికి - జీవితం దుర్బరమని పిస్తుంది.
875. హృదయం ఆకాశం వలె - విశాలంగ వుంచాలి
విశాల హృదయంలోనే - విశ్వనాధుడు కాపుర ముంటాడని
గ్రహించాలి
876. వేళ్ళు తొలగించక - చెట్టు కొమ్మలు తొలగించినను
చెట్టు తిరిగి చిగిర్చి - వృద్ధి నొందగలదు అలాగే
మనిషిలో దాగివున్న - తృష్ణను ఆశను సమూలంగ
తొలగించనిచో - దు:ఖము ఉద్భవించుచునే వుండును
Subscribe to:
Post Comments (Atom)
మౌనమూ శబ్దమూ!
మౌనమూ శబ్దమూ! మీ శబ్దాలన్ని మౌనాలౌతాయి కాల గమనం వాటిని మింగేస్తుంది మీ శబ్దాలన్ని శూన్యాలౌతాయి ఆత్మరహిత ప్రతిధ్వనులై మిగిలిపోతాయి మా మౌ...
-
నమస్తే తెలంగాణ….. విద్యార్థి… నీ హక్కులేవీ? సల్వాజి మాధవరావ్ - 93916 73807 తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పోరాటాల పునాదులపై నిర్మితమైంది. 19...
-
మానవాభ్యున్నతికి సహృదయత కావాలి. సదస్సులు కావు. భారతీయ హృదయం పాశ్చాత్య మేధస్సును స్పృశించాలి. అప్పుడే యుద్ధాలు అదృశ్యమవుతాయి. శాంతి నెలకొంటుం...
-
I have updated(26-04-2012)the folder: except MBK – 75 Raga Vaibhavam – Vol 04.part2.rar this link is not working presently if anyone has the...
No comments:
Post a Comment