Thursday, 24 April 2025

మంచిమాటలు 877 to 966

మంచిమాటలు 877. ఉత్తముని కోపము - ఒక నిమిషము - నీటి పై వ్రాతవలె మధ్యముని కోపము - రెండు గడియలు - ఇసుకపై వ్రాతవలె అధముని కోపము - ఒక రోజు - పలకపై వ్రాతవలె అధ మాధముని కోపము - చావు వరకు - శిలా ఫలకము పై చెక్కిన అక్షరములవలె కోపము వెంట పడవద్దు కోపానికి బానిస కావద్దు 878. జ్ఞానం అనేది - తరగని ధనాగారం సాధనము అనేది - దానిని తెరచే తాళం తాళం - ఎవడి సొంతమో ధనాగారం - అతని సొంతమే 879. జీవితంలో సమస్యలే లేక పోతే - అభివృద్ధికి అవకాశమే లేదు సమస్యలను సక్రమంగా అధ్యయనం చేసుకో - అభివృద్ధికి పునాది వేసుకో 880. ఊహించనిది - జరిగితే దానిలోనే జీవించటం - నేర్చుకో 881. బాధ్యతను బరువుగా భావించి - తప్పుకోకు బాధ్యత - స్వధర్మంగ భావించి సక్రమంగ - నిర్వహించుట మానుకోకు 882. కృతఘ్నుని స్నేహం - నీటిపై రాత లాంటి ది నీటిపై రాతలు కనపడవు, నిలబడవు - జాగ్రత్త పాటించాలి 883. ధర్మ ప్రవృత్తి గల వానిని - దూషించువాడు ఆకాశము వంకచూసి - ఉమ్మి వేయు వాని వంటి వాడు 884. మంచి ప్రవర్తన - అన్ని చదువుల కంటే మిన్న ప్రవర్తన సరి లేనిచో చదివిన చదువులన్ని సున్న 885. మానవ జీవితం - ఒక అద్భుతమని భావించు జీవితాన్ని సద్వినియోగ పరచు - సార్ధకత చేకూర్చు మరు జన్మ వచ్చినా - ఉత్తమ జన్మ వచ్చునని భావించు 886. కొందరి మాటలు - అధమం వాగ్దానాలు - అత్యధికం ఆచరణ మాత్రం - అత్యంత శూన్యం అమలు పరచలేని - వాగ్దానాలు చేయకు చేసిన వాగ్దానాలు - అమలు పరచుట మరవకు 887. నీ పుత్రులలో ఉన్న వానిని - ప్రేమతో పలుకరించు నీ పలకరింపుతో - అతను పులకరించు 888. చేసిన తప్పుకు - క్షమాపణ కోరుము క్షమాపణ కోరితినని - మరో తప్పు చేయకు 889. పిచ్చి ఆలోచనలతో - విసిగిపోకుము మంచి ఆలోచనలతో - మనశ్శాంతి పొందుము 890. ఒక సదవకాశం చేజారిపోతే కన్నీళ్ళు - పెట్టుకోకు మరో అవకాశం - చేజారి పోతుంటే జాగ్రత్త - పడుము 891. ఇతరులను జయించే వాడు - బలవంతుడు తనను తాను జయించుకునే వాడు - శక్తిమంతుడు 892. ఆరోగ్యమే మహా భాగ్యం - అందరికీ తెలుసు సంతృష్టమే మహా సంపద అని - కొందరికే తెలుసు 893. తనలో - తప్పు లేనప్పుడే ఆగ్రహించవలసిన అవసరం - లేదు తప్పు చేసినప్పుడు - నిగ్రహంగా సమాధానం చెప్పుటలో విసుగు చెందకు 894. మరణించిన తరువాత - జీవించాలంటే జీవించినంత కాలం ఉన్నతంగా, ఉత్తమంగా - జీవించాలి 895. మంచితనాన్ని - కాలం కూడా కబళించలేదని - గ్రహించాలి 896. ఆయుధాలు తమంత తాము - ఎవరికిని ప్రమాదము కలిగించవు మనిషిలోని కోపమే - ప్రమాదమును కలిగించును 897. భగవంతుని ఆరాధించు - తోటి మానవుని గౌరవించు 898. నీ మాటలు - గొప్పవే కావచ్చు నీ ప్రవర్తన బట్టి - నిన్ను అంచనా వేస్తారని భావించు 999. ఆ ఆవేశంతో - ఊగిపోతావా! నీవు ఎంతో శక్తిని - కోల్పోతావు 900. ఇతరుల మంచికే - తీసుకో నీలోని దోషాలు - చూచుకో 901. మంచి పనులకు హృదయాన్ని జోడించు చెడ్డ పనులను - మనస్సులో కూడ ఊహించకు 902. భగవంతుడు సర్వోన్నతుడైన - సహచరుడుగా భావించు మరియు నీ శ్రేయుభిలాషియని - గ్రహించు ఈ సత్యాన్ని మరచినప్పుడు - ఒంటరివానివయనట్లేనని గమనించు భగవంతుడు గమనించలేదని - భావించకు సర్వ సాక్షిగా ఉన్నాడని మరువకు మంచిమాటలు 903. సహనం మరియు మౌనం - ఎయిర్ కండిషన్ వలె పని చేస్తాయి మనిషిలోని సామర్థ్యాన్ని - అధికం చేస్తాయి 904. ఎప్పుడూ ప్రశాంతత లభించాలని అభిలషిస్తావా! అన్నివేళలా మనసును - అదుపులో పెట్టుకో! 905. సర్వులను సర్వ కాలము - మోసగించలేము మోసము వద్దు - సహకారం ముద్దు 906. కోపాన్ని - ప్రయోగించకు వినయాన్ని - ఉపయోగించు విజయాన్ని - చేకూర్చు 907. అసూయకు - సమాధి కట్టుము మానవత్వానికి - విలువ చేకూర్చుము 908. ఉన్నతంగా - ఆలోచించు ఉత్తమునిగా - జీవించు 909. ఆపదలో - ఆదుకొనువాడే ఆత్మ - బంధువు 910. గౌరవము - నీకే అవసరమని భావించకు అందరికి - అవసరమని మరువకు ఇతరులను - గౌరవించుట అది నీకే - గౌరవమని భావించుము ఇతరుల గౌరవం - పొందాలంటే ముందు వారినే - గౌరవించుము 911. శక్తి కంటే - యుక్తి గొప్పది యుక్తి అవసరమైన చోట - శక్తి పని చేయదు చేపను పట్టుకొనుటకు - శక్తి పని చేయదు యుక్తియే - ఉపయోగపడును 912. మృదువైన మాట - కోపాన్ని చల్లార్చుతుంది నొప్పించే మాట - కోపాన్ని కలిగిస్తుంది. 913. పక్షిలా ఎగరడం సాధించాడు మానవుడు మానవుడుగా జీవించడం - సాధించలేక పోతున్నాడు 914. వెయ్యి మైళ్ళ - ప్రయాణానికైనా ఒక్క అడుగు తానే - ప్రారంభం ఏ ఘన కార్యానికైనా - ధృడమైన సత్సంకల్పమే - పునాది 915. ఒకరి పై ద్వేషం - పెంచుకొనుట తన వికాసాన్ని - తానే ఆపుకొనుట వంటిది 916. అందరి ముందు - ఆగ్రహించుట కంటే ఒంటరిగ కలిసి - మందలించుట ఉత్తమం 917. మాట్లాడే వాడి మాటల్లో - ఆలోచన ఉండదు కర్రతో కొట్టి నీటిని - వేరు చేయలేము అజ్ఞానికి నీతులు బోధించి - బాగు చేయలేము అయినా ప్రయత్నించి - సఫలమవుదాము 918. ఊరికి దారి చూపించే బోర్డు - అవసరమే ఊరికి మన కాళ్ళతోనే - నడవాలి పెద్దలు మంచి మార్గమును చూపుతారు ఆ మార్గములో పయినించి - గమ్యము చేరాలి 919. శాస్త్రవాక్యం అమోఘమే - అర్థం చేసుకొనుటలో తిరోగమనమే శాస్త్రవాక్యం అర్థం తెలుసుకో - అమలుచేసి ఆనందించుట నేర్చుకో 920. కూలి వాని చెమట - ఆరక ముందే శ్రమకు తగిన ప్రతిఫలం - అందించు కూలివాని ప్రతిఫలములో - వాటాలు కోరువారు వున్నారు వాటాలు కోరవద్దు - తంటాలు పెట్టుకోవద్దు 921. పెద్ద పెద్ద కార్యక్రమాలను - చేస్తున్నవారు విలువైన చిన్న విషయాలను దాటవేస్తున్నారు మంచి విషయాలు చిన్నవైనా - పెద్ద బుద్ధితో అమలు పరచు ఆనందించు 922. సోదరత్వం కన్న - ఆత్మ తత్వం మిన్న 923. పగిలిపోయిన బొమ్మల కొరకు - పిల్లలు ఏడుస్తారు నలిగిపోయిన జీవితాల కొరకు - పెద్దలు ఏడుస్తారు జీవితాలను శాంతిమయం చేయుటకు ప్రయత్నిస్తారు 924. కరెంటు లేని బల్బు - వెలుతురు నివ్వదు ప్రేమ లేని హృదయం - శాంతి నివ్వదు 925. ఎంత చెడ్డ వానిలో కూడా - కొంత మంచి వుంటుంది హంస నీటిని వదిలి - పాలనే స్వీకరించినట్లు మంచినే స్వీకరించి - చెడును వదిలేస్తాం 926. దేవునిపై వున్న భక్తి - జీవులపై కూడా ఉంచుము దేవుని పూజించు - జీవులను రక్షించు 927. సంతృప్తి నుండి - ఆనందం ఉదయిస్తుంది ఆనందం - అన్ని సమకూరుస్తుంది 928. అదృష్టం కొరకు - ఎదురు చూడకు ప్రయత్నించుట - మానివేయకు ప్రయత్నం చేయక - పలాయనం చెందకు సోమరి తనానికి - చోటు కల్పించకు 929. కష్టమైన పనియైననను - ఇష్టమనిపిస్తే కష్టమనిపించదు కావున కష్టమైనను - మంచి పనులు ఇష్టంగ చేయుము 930. జీవితం సాఫీగ - సాగాలంటే కోరికల నుండి - విడుదల కావలసిందే 931. ఇతరులను విమర్శించే - సమయాన్ని ఇతరులలోని - మంచిని గ్రహించుటకు కేటాయించు 932. బాధ్యతగ - వ్యవహరించు విజయం నీదే - అని భావించు విజయాన్ని సాధించిన - ప్రతి వ్యక్తి బాధ్యతను - స్వీకరించిన వాడే అని గ్రహించు 933. సత్యాన్ని - బోధించు అసత్యాన్ని - ఖండించు అశుభాన్ని - నివారించు ఆనందాన్ని - అనుభవించు అదే జీవితమని - భావించు 934. నిన్ను నీవు నిర్దయగ - విమర్శించటం నేర్చుకో అప్పుడు నీవు ఇతరుల యెడల - దయతో మెలగడం నేర్చుకోగలరని తెలుసుకో 935. మనిషిని - సముదాయించు మనస్సుకు - శాంతి చేకూర్చు 936. శాంతిని ఆకర్షించే - అయస్కాంత శక్తిని సాధించు అశాంతితో బాధపడే వారంతా - నిన్ను ఆశ్రయిస్తారని భావించు 937. భగవంతుని ఉనికిని - గుర్తించు సర్వం సాధించినట్లేనని - భావించు 938. సంపద పోతే - ఏమి కోల్పోయినట్లు కాదు ఆరోగ్యం లోపిస్తే - కొంత పోగొట్టుకున్నట్లే శీలం పోతే - సమస్తం పోయినట్లే 939. సమస్యల గురించి ఎంత ఆలోచించామనేది - సమస్య కాదు పరిష్కారం ఎంత వరకు సాధించామన్నదే - అసలు సమస్య 940. ప్రేమ తత్వం - పరిమితులు లేనిదై యుండాలి హద్దులు, సరిహద్దులు - దానికి అంటకుండా ఉండాలి 941. కర్రలూ, రాళ్ళు - ఎముకలనే విరగ గొడుతాయి కఠిన మాటలు - (మనుష్యుల మధ్య సంబంధాన్ని విరగ గొడతాయి) మనుషులకు బాణాల్లాగా గుచ్చుకుంటాయి 942. ఇతరులతో - సరిపోల్చు కోవడం ప్రారంభించావా! అసూయ అయినా - పెరగవచ్చు అహంకారమైనా - అధికం కావచ్చు అసూయ వద్దు - అహంకారం అసలే వద్దు అసూయను అంతము చేయుము - అహంకారాన్ని అణగ ద్రొక్కుము 943. చింతలు లేని వాడు - చిరునవ్వు నవ్వగలడు చింతించు వాడు - విరక్తి చెందగలడు 944. నిన్నటి దినం పొరపాటుతో - వృథా చేశావు ఆ దిగులుతో ఈ దినం - వ్యర్థం చేసుకోకు కొన్ని మరుచుట - అవసరం మరికొన్ని గుర్తుంచుకొనుట - అత్యవసరం 944. కష్టాలను మరచిపో - భగవంతుని గుర్తుంచుకో కర్మ ఫలాన్ని - అనుభవించుటకు సహజ శక్తి - ప్రదర్శించు సహన శక్తి - కోల్పోతే పక్వం కాని ఫలాన్ని - తినాలని తొందరపడినట్లే 946. చిన్న చిరునవ్వు - నవ్వుము ఎంతటి కష్టమైన - పనినైనా సు సాధ్యం - చేసుకొనుము 947. నిత్య సంతోషులు - ఎన్నడును సోమరులు కారు సోమరి తనము - గొప్ప దురలవాటు 948. పరుల సంతోషం - నీ సంతోషంగ భావించు పరుల బాధలు నీ బాధలుగ - భావించి సహకరించు పరులను సంతోషింపచేయుట - ఒక వరముగ ఊహించు 949. సత్ శీలం లేకపోతే - నిన్ను ఎవరు గౌరవించరు సద్గుణాలు కలిగియుండుము - అందరి గౌరవము అందుకొనుము 950. జీవితం ఒక నాటకం - అనుకున్న వాడికి సంతోషం వాడికి స్వాగతిస్తుంది 951. అజాగ్రత్త చిన్నదైనను - కీడు అధికము నిరంతర జాగ్రత్త సదా అవసరం 952. అసూయను మించిన - రోగం లేదు ప్రేమకు మించిన - ఔషధం లేదు 953. సృష్టి మారదు - దృష్టిని మార్చుకో 954. గుణమును - గుర్తించు, కులమును - విస్మరించు 955. దీర్ఘ జీవితము కంట, దివ్య జీవితము గొప్ప 956. పోయిన సమయం రాదు - ఉన్న సమయం వృధా చేయకు 957. రాముడైనా - రహీమైనా, ఏసు - ఐనా, ఈశ్వరుడయినా పూజల కన్న సత్ ప్రవర్తనే మిన్న అని తెలుసుకో 958. అన్నదమ్ములలో - ఐక్యత లేదు అన్నదుమ్ములనే పదానికి - అర్థమే లేదు నీ పొరుగు వానిని - నీ వలె ప్రేమించు ఎవరిని ద్వేషించకు - నీవలె ఆదరించు 959. కష్టాలను చూసి - కంగారు పడకు కష్టాలను ఇష్టంగ - ఆహ్వానించుట మరువకు కష్టాలు - కనుమరుగు అగునని భావించు 960. ప్రతి రోజు దైవ ప్రార్థనతో - జీవితం ప్రారంభించుము దానముతో ఆ రోజును - ముగించుము 961. ప్రార్ధన దైవమునకు - దారి చూపుతుంది దానము దేవునికి - దగ్గర చేరుస్తుంది 962. ప్రార్ధన కొంత వరకే - ఉపకరిస్తుంది సత్ ప్రవర్తన - సదా ఉపకరిస్తుంది 963. దానమందు - నిదానము పనికిరాదు కష్టాలల్లో ఉన్నవానికి - సహకరించుము భగవంతుని మెప్పించినట్లు - భావించుము. 964. డబ్బును సక్రమ మార్గములో సంపాదించుము డబ్బును - సద్వినియోగపరుచుము డబ్బును సద్వినియోగ చేసి - సంతృప్తి చెందును 965. గాలి దూరని చోటు - ఉంటుంది దేవుడు లేనిచోట - లేనే లేదు 966. పేదలకు అండగలేని నీవు - దండగ పేదల కడుపు కొట్టకు - పెనుముప్పు పొందకు ****************************************

No comments:

Post a Comment

పరిత్రాణాయ సాధూనాం

అవ్యక్తం వ్యక్తం అవ్యక్తంగా అనంతుడైన భగవంతుడు వ్యక్తం కావడమే అవతారము. భగవంతుని అవతారములో అనంతమైన కారుణ్యమే ప్రధానంగా గోచరిస్తుంది. ఒక్క విషయ...