Tuesday, 15 April 2025

మంచిమాటలు 604 to 701

మంచిమాటలు 604 to 701 604. మానవత్వం - విలువ తెలుసుకో మానవత్వానికి - మలినం అంటించకు మానవత్వానికి - మచ్చ తెచ్చితివా మాధవుడు కూడా - క్షమించడు 605. వదలిన బాణం - వెనక్కు రాదు చేసిన పాపం - వదలి పోదు 606. బలముందని - బజారున పడకు బుద్ధి బలం పెంచుకుని - బుద్దిగా ఉండు బుద్ధి లేని మనిషి - శుద్ధ దండగ 607. ప్రజలు నిన్ను గుర్తించలేదని - ఆందోళన చెందకు గుర్తింపునకు సరిపడ - సమర్థత పెంచుకో 608. ఇంట గెలిచి - రచ్చ గెలువు అన్నీ బాగుంటే - అందరూ పెద్ద మనుష్యులే 609. అద్దములోని నీ స్వరూపానికి - దండ వేయలేదు నీ మెడలో దండ - వేసుకుంటే అద్దంలోని నీకు దండ పడుతుంది. లోకులను - బాగు చేయాలంటే ముందు నిన్ను నీవు - బాగు చేసుకో నిన్ను నీవు - సరిదిద్దుకోగలిగినప్పుడు ఇతరులను - తేలికగా సరిదిద్ద గలవు 610. కనికరం - కలకాలం ఉంచు కాఠిన్యం - కలలో కూడ ఉంచకు బండతనం మొండితనం - బ్రతుకు అప్రయోజనం నిస్వార్థం, జాలితనం - జీవితానికి ప్రయోజనం 611. పరిస్థితులు కలిసివస్తే - నా గొప్పతనమే నంటారు పరిస్థితులు విషమిస్తే - భగవంతుని దయ లేదంటారు 612. స్వలాభం - అప్రధానంగా చూడు పర లాభం - ప్రధానంగా చూడు 613. తల్లి ప్రేమ - తరగనిది అది - ఊట బావి వంటిది 614. ప్రజా సేవ చెయ్యి - ప్రగతిని సాధించు ప్రగతి లేనిదే - ప్రయోజనం లేదు 615. అహం వద్దు - పేదలు ముద్దు ఇదే మన హద్దు 616. కావలసినవి - దొరకనప్పుడు దొరికిన వాటితో - తృప్తి పొందుము కోరుకున్నవి - దొరకనప్పుడు దొరికినవే - కోరుకొనుము 617. నీవు ఇతరుల నుంచి - మంచినే ఆశిస్తావు ఇతరులకు కూడా - మంచినే పంచి ఇవ్వు 618. కత్తి ఉందని జేబులు కత్తిరించకు చేతులు ఉన్నాయని - చేయరాని పనులు చేయకు అధికారముందని - అహంకారం చెందకు అహంకరించితివా - అధోగతే అని మరువకు 619. దీపముందని - గుడిసెలు కాల్చి గుండెలు ఆర్పకు దీపముతో - దీన జనులకు వెలుగునివ్వు 620. దేవుని వద్ద గల దీపానికి - అందరూ నమస్కరిస్తుంటారు కల్లుకొట్టు వద్ద గల దీపానికి - అందరూ ఎంగిలి ఊస్తూ ఉంటారు స్థలా భోగం - శీలా భోగం అంటే ఇదేనంటారు 621. కలాయి లేని పాత్ర - పులుసుకు పనికిరాదు అసూయ గల మనిషి - ఎందుకు పనికి రాడు అసూయ - ఏరు పురుగు వంటిది ఏరు పురుగు కనిపించదు - చెట్టును చిత్ర వధ చేస్తుంది అసూయ కూడా - మనిషిని సర్వనాశనం చేస్తుంది 622. దారి తప్పితే కొంతే - ప్రమాదం నీతి తప్పితే అంతా - ప్రమాదమే 623. శాంతి ఉన్నచో - సమస్తం ఉన్నట్లే శాంతి లేనిచో - ఏమీ లేనట్లే 624. అమర్యాదగా - జీవించుట కంటె గౌరవముగా - మరణించుట మేలు 625. ఏ మార్గమైనా పర్వాలేదు - దుర్మార్గం కాకుంటే చాలు అవసరాలకు మించి - ఆశ పడకండి 626. అతి భాషణ - మతి హాని మిత భాషణ - అతి హాయి 627. తిన్నది జీర్ణమగుట - ఎంత ముఖ్యమో విన్నది ఆచరించుట - అంతకంటే ముఖ్యము మంచినే వినుము - మంచియే చేయుము 628. హింసించే వాడు - హీనుడు రక్షించే వాడు - మానవుడు 629. నీలో ఉండే దోషాలు - చూచుకో అవి రాకుండా, లేకుండా - చేసుకో ఇతరులలోని దోషాలు - ఎంచకు 630. అన్నిటికంటే సులభం - ఇతరుల తప్పులను భూతద్దంలో చూపించడం. అన్నిటికంటే కష్టం - తన తప్పును తెలుసు కోలేక పోవడం 631. పాము కన్నా ప్రమాదకరం - పాప కార్యం పాప కార్యాలే - పతనానికి మూలం దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి ఈ సూక్తి అందరికి స్ఫూర్తినిచ్చును గాక 632. చిన్న చిన్న విషయాలను - పెద్దవిగా చేయకండి ; గోరంతలు కొండంతలు చేసి గొడవలు సృష్టించవద్దు 633. మంచి పనులు - చేయండి మంచి మనుషులుగా - నిలవండి మీ మంచితనమే - మీకు కొండంత అండ అని తెలుసుకోండి 634. మానవ శరీరం ధరించిన వారంతా - మానవులే మానవత్వం గలవారే - అసలైన మానవులు 635. సహనమే - సంస్కృతి మానవతే - నాగరికత 636. పగిలిన అద్దం - పనికిరాదు విరిగిన మనసు - అతకదు కరిగిన మనస్సే - కావాలి కాఠిన్యం - తరగాలి; కారుణ్యం - పెరగాలి 637. హృదయ వైశాల్యమే - విశాల సామ్రాజ్యం 638. మనిషి - అకాలం మానవత్వం - చిరకాలం 639. నీరు - ప్రాణాధారం నిజము - శాస్త్రాధారం 640. కరుణ - మానవత్వానికి వివరణ 641. మమ్మీ డాడీ వద్దు అమ్మా నాన్నే - ముద్దు 642. తోటి మనిషిని - ప్రేమించు మంచి మనిషిగా - జీవించు 643. మానవత్వమే - పండగ దానవత్వం - దండగ 644. తన సంతోషమే - స్వర్గము తన దుఃఖమే - నరకము 645. మంచి తనమే - మహా బలము చెడ్డ తనమే - గొప్ప శాపము 646. మనిషి అశాశ్వతం - మానవత్వం శాశ్వతం 647. దుర్భుద్ది వద్దు - సద్భుద్ధి హద్దు 648. ఇచ్చుకొనుటలో ముందుండు పుచ్చుకొనుటలో - వెనకుండు 649. ఎవరి స్వార్థం - వారిది నిస్వార్థం - కొందరిది నిస్సహాయ స్థితిలో - వెనక్కి తిరిగి చూస్తూ వుంటావు ఆదుకొనువారు - ఎవరు రాలేదని తెలుసుకునే వుంటావు నీ వద్ద ఉన్న దానిని -కాజేయుటకు వచ్చు వారిని గమనించే ఉంటావు వాడు కాజేయకముందే - మంచి పనులకు నీవే వెచ్చించు 650. అంత్య కాలం - అందరికీ ఉంది ఉన్న కాలం - మంచికే వినియోగించు నీ మంచి తనమే - నీకు శ్రీరామ రక్ష 651. పోలీసు వాడిని చూస్తే - దొంగకు భయం యముని చూస్తే - పాపికి భయం పాపంతో - ప్రయోగాలు చేయకు త ఉండ పాపం - పతనానికి మూలం 652. విజ్ఞానం వికసించాలి అజ్ఞానం - అడుగంటాలి బాటలు అనేకం డోవ్వెత్తులు 348 653. నగరం ఒకటే - బాటలు అనేకం దేవుడు ఒకటే - దారులు అనేకం బంగారం ఒకటే - ఆభరణాలు అనేకం. దూది ఒకటే - బట్టలు రకరకాలు పాలు ఒక్కటే - గోవులు పలు రకాలు లేదా పలు వర్ణాలు 654. ఆభరణాలతో - అందం రాదు మంచి గుణాలే - మనిషికి అందం 655. నీకు కష్టం నష్టం కలిగించేవి - ఇతరులకు పంచకు నీకు ఆనందం అందించిన వాటిని - అందరికీ పంచుము 656. సత్యానికి స్వాగతం పలకండి అసత్యానికి - వీడ్కోలు చెప్పండి 657. త్యాగానికి - పట్టం కట్టండి లోభానికి - సంకెళ్ళు వేయండి 658. శత్రువు చెడిపోతుంటే చెప్పడు అదే మంచిదని ప్రోత్సహిస్తాడు. మన పతనానికి దారి చూపిస్తాడు 659. మిత్రుడు ఘాటుగా దండించి దారి మళ్ళించి చక్క దిద్దుతాడు, సక్రమంగా నడిపిస్తాడు 660. బంధాలే బరువులు బంధువులు రాబందులు 661. మనిషికి, మనసుకు - బంధాలే బరువులు 662. ముడి పెట్టుట - సులభతరం ముడి విప్పడమంటే - కష్టసాధ్యం 663. చచ్చిన వాని ఆస్తి కొరకు - వాదులాడు వారు కొందరు వాని బంగారు కన్ను కొరకు - ఏడ్చేవారు మరి కొందరు ఏడిపించేవారు - ఎక్కువైనారు - ఏడుపు మాన్పించేవారు తగ్గుతున్నారు. 664. చచ్చిన చెట్టుకు - నీరు పోసిన ప్రయోజనముండదు ఆచరించని వానికి - ఎన్ని నీతులైనా ఉపయోగముండదు 665. భక్తి ఉంచుకో - బాధలు త్రెంచుకో సత్యమే మానవునకు - పథ్యమై యుండాలి 666. పాపిని దుఃఖాలు - పట్టి పీడించు పుణ్యునికి సౌఖ్యాలు - ప్రీతితో చేరు ప్రేమతో ద్వేషాన్ని - పారద్రోలు చెడు తలంపు - తెచ్చు చేటు మనకు 667. పాప కార్యాలు - పడత్రోయు నరకాన పాపాన్ని విషమువలె - పారవేయి ఇహలోన 668. హింసకు - ప్రతి హింస పనికి రాదు చెడు చేరదీయకు - మంచి మానివేయకు 669. అసూయే అశాంతికి - మూలమని మరువకు 670. చేయకు మళ్ళీ మళ్ళీ - చెడ్డ కార్యాలు చేయుము మళ్ళీ మళ్ళీ - మంచి కార్యాలు 671. చెడును ఆచరించకు - మంచిని త్రోసి పుచ్చకు మంచిని ఆచరించుటలోనే - ఆనందించుట మరువకు 672. శాంత స్వరూపుడే - నిజమైన సాధువు 07. ఇంద్రియాలను జయించిన వాడే - విజ్ఞాన ఘనుడు మానవుని శత్రువులు 673. అవివేకం - మూర్ఖున్ని చేస్తుంది అజ్ఞానం - కుసంస్కారిని చేస్తుంది అసూయ - అనర్థం చేస్తుంది అసురత్వం - అరాచకం చేస్తుంది ఇవన్ని ఒకేచోట చేరితే మానవుడు దానవుడవుతాడు, అనగా రాక్షసుడవుతాడు, అలా కారాదు మానవుడు మాధవుడు కావాలి అదే జీవితాశయంగ మారాలి మానవుని మిత్రులు 674. జ్ఞానం - పరిపూర్ణత నిస్తుంది విజ్ఞానం - వివేకవంతుణ్ణి చేస్తుంది మంచితనం - మానవత్వాన్ని పెంచుతుంది ప్రేమ - అమరత్వం కలిగిస్తుంది పశ్చాత్తాపం - సమస్త మాలిన్యాన్ని పోగొడుతుంది ధర్మం - అందరిని రక్షిస్తుంది దైవత్వానికి మార్గం 675. మంచినే - చూడండి మంచినే - వినండి మంచినే - మాట్లాడండి మంచినే - తలచండి మంచినే - చేయండి దుర్మార్గం - దులపండి సన్మార్గం - పొందండి 676. దాచుకునే - స్వార్థం వద్దు దోచుకునే - దౌర్భాగ్యం వద్దు అపకారం - వద్దు ఉపకారం - ముద్దు 677. కష్టాలను చూచి పారిపోరాదు సుఖాలను చూచి - మురిసిపోరాదు 678. ఆశ అధికమైతే - అగచాట్లు ఎక్కువ ఆశ లేని వానికి - ఆనందమే మక్కువ 679. దురాశ దుఃఖాన్ని - ఇచ్చును అత్యాశ అధోగతిని - చేర్చును 680. హింసించే వారంతా - హీనులు హింస చేయని వారంతా - హీరోలు 681. మతమనగా: గుడులు కట్టించుట గుండ్లు గీచుకొనుట గంటలు మ్రోగించుట నైవేద్యము పెట్టుట కొబ్బరి కాయలు కొట్టుట పూజలు చేయుట యాగాలు చేయుట మాత్రమే కాదు మతిని శుద్ధం చేసేదే - మతమై యుండాలి - మానవత్వం లేని మతం - మతమే కాదు మానవుని దానవుని చేసేదే - మతం కాదు మానవుని మాధవుని చేసేదే - నిజమైన మతము 682. ముసలిపై కూర్చొని - నదిని దాటలేరు దుర్గుణాలు అనే ముసలిపై - సవారి చేస్తున్నారు మోక్ష ధామము అనే - గమ్యము చేరలేరు 683. కంటి డాక్టరుకు - కన్ను పంటి డాక్టరుకు - పన్ను హార్టు డాక్టరుకు హార్టు పని చేస్తాయను గ్యారంటీ లేదు. దైవమే అందరికి శరణ్యము 684. తంటాలు పెట్టకు - తమాషా చూడకు 685. ద్వేషాన్ని జయించాలంటే - ప్రేమను పెంచవలసిందే ప్రేమను పంచు - ద్వేషాన్ని త్రుంచు . ప్రేమ ఉన్న చోట - ద్వేషానికి చోటు లేదని గ్రహించు 686. నీరు పారుదల లేకపోతే - పాచి పడుతుంది తిన్నది విసర్జించక పోతే - కడుపు కంపు కొడుతుంది నీ సంపాదనలో కొంత - దానము చేయుము దానము చేయని ధనము - దండగే అవుతుంది దానము చేయుము - ధనానికి సార్థకత చేకూర్చుము 687. సలహాలు కంటే - సహాయం మిన్న మంచి తనమే - మానవత్వమన్నా 688. నీకు తెలియంది - తెలుసుకో తెలిసింది - దాచుకోకు 689. ఇంట్లో శతృవులతో కొంత బాధ వంట్లో శతృవులతో - అమిత బాధ మన ఇంద్రియాలే - మనకు శత్రువులు ఇంద్రియాలను జయించు - విజయం సాధించు లోకాన్ని జయించి తృప్తి చెందకు - ఇంద్రియాలను జయించి సంతృప్తి చెందుము 690. మంచి మాట - మంచి ఊహ మనిషికి మనస్సుకు - ఆరోగ్యకరము 691. నీ చెంప నీవు - కొట్టుకోవు ఎదుటి వాని చెంప - కొట్టకు 692. శాంతముతో - కోపాన్ని జయించు ప్రేమతో - ద్వేషాన్ని జయించు దానముతో - లోభాన్ని జయించు అహింసతో - హింసను జయించు 693. ఆహార నియమములు పాటిద్దాం సాత్వికాహారము, మితాహారము, దైవార్పితాహారము, న్యాయార్జితాహారము భుజించు 694. నీ కంట్లో కారం - చల్లుకోకు ఎదుటి వాని కంట్లో - కారం చల్లకు ఉండ నీ వలె ఇతరులను - చూచుకో 695. చెడు చేసి - చెడిపోకు మంచి పనులు చేసి - మనిషిగ బ్రతుకు 696. బొగ్గును పాలతో కడిగిన - నలుపు పోదు కొందరికి ధర్మ బోధ ఎంత చేసిన - మనస్సు కరగదు 697. కల్తీ లేని మనిష్యులు - కల్మషం లేని మనుష్యులు కాఠిన్యం లేని మనుష్యులు - కారుణ్యం గల మనుష్యులు కరుణా మూర్తులు - కరువైనారు మనకు కనికరం గల కరుణామూర్తులు - కావాలి మనకు 698. నిజమైన భక్తుడు - అన్నీ నీ వస్తువులే స్వామీ మీ పాదాలు మాత్రమే - నావి అని అంటాడు 699. కోపాన్ని - కోపగించుము ఆవేశాన్ని - అరికట్టుము లోభాన్ని - వదిలి వేయుము ఈర్ష్యను - ఈడ్చి వేయుము అసూయను - అంతము చేయుము ద్వేషాన్ని - దులిపి వేయుము దోషాన్ని - దూరం చేయుము ఆశను - అణగ ద్రొక్కుము రోగము - వదిలిపోవును 700. క్రోధాన్ని - గెంటి వేయుము అహంకారాన్ని - అణగ ద్రొక్కుము దుర్గుణాలను - దులిపి వేయుము సద్గుణాలకు - స్వాగతం పలుకుము 701. పాము విషము కన్న - పాప కార్యము విషము మిన్న పాప కార్యాలు - చేయబోకన్న మంచిమాటలు 604 to 701

No comments:

Post a Comment

పరిత్రాణాయ సాధూనాం

అవ్యక్తం వ్యక్తం అవ్యక్తంగా అనంతుడైన భగవంతుడు వ్యక్తం కావడమే అవతారము. భగవంతుని అవతారములో అనంతమైన కారుణ్యమే ప్రధానంగా గోచరిస్తుంది. ఒక్క విషయ...