పాము కరచిన - ఒక జన్మకు హాని పాపముచే కరవబడిన - జన్మ జన్మలకు హాని
702. ద్వేష రాహిత్యమే - భగవంతునికి ప్రీతికరమైన పూజ
703. నీలోని మంచిని - ఇతరులు గుర్తించాలని అభిలషిస్తావు
ఇతరుల మంచిని నీవు గుర్తుంచుటకు - ప్రయత్నించు
704. విశ్వ శాంతిని కోరువాడే - ఆత్మ శాంతిని పొందగలడు
705. మర్యాద చూపండి - మన్నన పొందండి
706. బంధుగణము బ్రతికుండగనే - పీక్కు తింటారు రాబంధువులు చచ్చిన పిదపనే - పీక్కు తింటాయి బంధువుల కంటే రాబంధువులే - మేలంటారు అందరి బంధువులు అలా వుండరని - మరి కొందరు అంటారు
707. వస్తువుకు గ్యారంటి - అవసరము మాటకు వారంటి - అవసరము
708. నీ పొరపాట్లు - తొందర పాట్లు మరొకరికి - అగచాట్లు కారాదు
709. ఉన్నతుడవై ఉన్నను - అణుకువతోనే వుండు అణుకువతోనే - ఉన్నత శక్తివారని మరువకు
710. ఉప్పు కర్పూరము - పోలికలు ఒకటే కావచ్చు రుచులు మాత్రం - వేరు వేరని గ్రహించు
మనిషి మనిషికి - పోలికలు సరిపోవచ్చు అభిరుచులు - వేరు వేరు కావచ్చని గ్రహించు
711. నీ రంగములో - నీవు గొప్పవాడవే కావచ్చు అన్ని రంగాలలో - తల దూర్చకు
తెలియని విషయాన్ని - తెలిసినట్టే నటించకు తెలిసిన విషయాన్ని - తెలియదని తప్పించుకోకు
712. దేవుడు గుడిలో వున్నాడు - అంటాడు సామాన్యుడు దేవుడు అంతటా వున్నాడంటాడు - వివేకవంతుడు
713. ప్రార్థించే పెదవుల కన్నా - చేయూతనిచ్చే చేతులు మిన్న
714. మేలు చేసిన వానికి - కీడు చేయకుము కీడు చేసిన వానికి - మేలు చేయుట మానకు
కూడు బెట్టిన వానిని - కూలద్రోయకు విద్యనేర్పిన వానిని - వెక్కిరించకు
ఉపకారికి అపకారం అసలే - చేయకు అపకారికి కూడ - ఉపకారము చేయుట మానకు
715. స్నానంతో - దేహ శుద్ధి కలుగును ధ్యానంతో - ఆత్మ శుద్ధి కలుగును దానంతో - ధన శుద్ధి కలుగును 716. నవ్వు - ఒక టానిక్ వంటిదని గ్రహించు నవ్వు - అందరిని నవ్వించు
కల్మషం లేని నవ్వు - కల్తీ లేని నవ్వు అదియే ఆరోగ్యకరమైన - నవ్వు అని భావించు
717. ఇహమందు - ఉపకారము చేయుము పరమందు - పరమాత్మను పొందుము
718. ఆడంబరము - ఆనందానికి దూరం నిరాడంబరము - నిర్మలత్వానికి మూలం
719. ఆత్మ విశ్వాసము లేని వానికి - అన్నీ సందేహాలే
720. ఉన్నతమైన ఆశయాల కొరకు జీవించు ఆశల కోసం జీవించకు
721. పుచ్చుకొనుటలో చూపిన శ్రద్ధ ఇచ్చుకొనుటలో కూడ చూపించు
722. ఐక్యత సౌభాగ్యం - అనైక్యత దౌర్భాగ్యం
723. ఓర్పును మించిన తపస్సు లేదు
724. కృషి ఉంటే కృప వుంటుంది
725. కరిగే వయస్సు - కదిలే జలము తిరిగిరావు
726. గుడులను పెంచుట మంచిదే సద్గుణాలను పెంచుట మరీ మంచిది
727. విచారంగ లేకపోవుట - సంతోషానికి కొలబద్ద
728. సైనిక బలము కన్న - నైతిక బలము మిన్న
729. హరికి దాసులు - కావాలి సిరికి దాసులు - కారాదు
730. హృదయం క్షీర సాగరం - కావాలి క్షార సాగరం - కారాదు
731. సాక్షరుడు రాక్షసుడుగ మారరాదు
732. ఉండాలి మనము ఉన్నత ఆశయాలతో చూడాలి మనము అందరిని సమానంగా
ఆదరించాలి అందరిని ఆప్యాయంగా అప్పుడే అనుభవిస్తాడు ఆ భగవంతుడు
733. అలవర్చుకోవాలి - సకల సద్గుణాలు అవే మనకు - ఈశ్వర సన్నిధికి మార్గాలు
734. మతం మానవునికి - మత్తు మందు కారాదు మతాతీతుడే సర్వులలో - సర్వ శ్రేష్టుడు
735. ప్రేమతో క్రోధాన్ని జయించాలి శత్రువునైనా ప్రేమతో వశపరచుకోవాలి
736. అన్ని మతముల సారం - సత్యమొక్కటే సత్యంగా జీవించు; అహింస పాటించు
737. దేవుని ప్రార్థించు ; సద్గుణాలు ఆచరించు సత్ఫలితాలు సాధించు
738. కర్తవ్యం నుంచి పలాయనం చిత్తగించకు విధి లిఖితం అని సరిపుచ్చకు
739. దేవుడే అన్ని చూసుకుంటాడని ఏ పని చేయక దేవుడిని బాధ్యునిగా చేసి
సోమరితనం పెంచుకోకు
740. డాక్టర్ గారూ ఆరోగ్యం - ఇవ్వలేరు చెడు అనారోగ్యం లేకుండా చేస్తారు.
741. నిరాడంబరమే మానవునికి - వెల లేని ఆభరణము నరుని సేవ చేస్తే - నారాయణుని సేవించినట్లే
742. నీతియే జాతి - అది వదిలితివా నీవు కోతి
743. నీతి నిరంతరం అవసరం
744. నీతి లేని వాడు, నిజాయితీ లేనివాడు నిజమైన మనిషి కాడు
745. పరీక్ష వద్దంటే ప్రగతిని నిరోధించినట్లే
746. భగవంతుడు చెప్పింది చేయి భగవన్నామాన్ని పట్టుకో - భవసాగరాన్ని దాటుకో
747. భగవంతుడు - భావ ప్రియుడే కాని బాహ్య ప్రియుడు కాదు
748. వెంట వచ్చేది - సంస్కారమే కాని సంసారం కాదు
749. రెండు దుఃఖముల విరామమే - సుఖముగా గోచరిస్తున్నది
750. లోకేషునికి వశము చేసుకుంటే లోకమే వశమవుతుంది.
751. వాదన సాధనకు పనికి రాదు
752. విత్తం సంసారమునకు అప్పగించు చిత్తం భగవంతునికి అప్పగించు
753. మనిషన్న వానికి - మంచి మనస్సుండాలి మలిన మనస్సుగలవాడు - మానవత్వం లేనివాడై ఉండాలి
754. దివ్య జీవితం కొరకు - తపించు దివ్యమైన పనులు - చేయుము దివ్య పురుషుల - జాబితాలో చేరుము మానవత్వ విలువలు - తెలుసుకొనుము మానవత్వాన్ని - సార్థకం చేసుకొనుము
755. కాకిలా - గోల చేయకు కోయిలలాగా - గానం చేయుము
756. ప్రేమ ఖడ్గము లేకనే పరిపాలిస్తుంది తాడు లేకనే ఛేదిస్తుంది
757. ఇతరుల ఉన్నతికి - అడ్డు తగలకు నీ ఉన్నతికి అది - ఉపయోగపడునని మరువకు
758, తాను మింగేది ఆహారం తనను మింగేది మృత్యువు అట్టి మృత్యువు దరి చేరక ముందే మంచి పనులు ముగించాలి
759. పాపమును డిపాజిట్ చేసిన - దుఃఖము అను వడ్డీ వచ్చి తీరును పుణ్యమును డిపాజిట్ చేసిన సుఖము, ఆనందము అను వడ్డీ లభించును కావున పుణ్యాన్ని - పెంచుకో
పాపాన్ని - త్రెంచుకో
760. చిన్న రంధ్రాలే - పడవను ముంచును చిన్న దోషాలే - మనిషిని త్రుంచును
761. ప్రపంచమే - మన ఇల్లు; ఇతరులకు మేలు చేయుటయే - మన మతము
762. మనము తిన్నది - మట్టిపాలు ఇతరులకు ఇచ్చింది - మన పాలు
763. కోరికలేల - మనకు-కొండంత - దేవుడుండ
764. ఓర్పు అందరికి ఆరోగ్యకరము
765. దుర్గుణాలను - దులపండి-సద్గుణాలను - పొందండి దుర్గుణాలకు - దూరంగా ఉండండి
సద్గుణాలకు - సమీపంగా ఉండండి
766. సద్గుణాలనే పూలతో - పూజించండి దుర్గుణాలు గల పూజలు - చెల్లని నోట్ల వంటివని
తెలుసుకోండి
767. ప్రేమతో - శాసించు-ద్వేషంతో - దూషించకు
768. శాంతి - సంపదలలో లేదు సంతృప్తియే సకల సంపదలకు మూలం తృప్తి లేని మానవుడే దఃఖమనుభవించును
769. అన్నిటికంటే విలువైనది - మౌనము మౌనము ద్వారా - మహా కార్యాలు రూపు దాల్చగలవు
770. మానవ శక్తికి - ఆగనిది కాలము కాలమును - వృధా చేయుట అవివేకుని లక్షణము
771. శక్తి కంటే - యుక్తి గొప్పది-యుక్తి కంటే - వివేకం గొప్పది
772. పుట్టిన తేదీ గుర్తుంచుకొనుట కంటే పుట్టింది ఎందుకో - గుర్తించుట మంచిది
773. కష్టాల వల్ల - విసుగు-విసుగు వల్ల - తెగింపు తెగింపు వల్ల - సుఖం కలుగును
774. దురలవాట్లే - శత్రువులు-సద్గుణాలే - మిత్రులు
775. తలలోని తప్పును, ఇతరుల మంచిని వెతుకు వాడు ఉత్తముడు
776. విరక్తి లేనిచో - విముక్తి కలుగదు
777. కాలు జారిన కొంత బాధ,-నోరు జారిన అమిత బాధ కావున నోటికి అదుపు అవసరం
778. జరగనున్నది - జరగక మానదు.- జరగబోనిది - జరగనే జరగదు ఈ భావన - ఉన్న వానిని ఏ చింతలూ బాధించవు
779. దురాశ - దుఃఖమును కలిగించును దుష్ఫలితముల నిచ్చును
780. అత్యాశ - అధోగతికి చేర్చును ఇచ్చిన దానము - వచ్చిన గౌరవము మరచుట మంచి
వారి లక్షణము
781. ఆవేశముతో - ఆలోచించకు ఆవేశము - అనర్థాలు కలిగించునని మరువకు
782. కారములకెల్ల కారం అపకారం, అహంకారం ఇట్టి కారం అధోగతికి మూలాధారం
783. చిరిగిన వస్త్రమును - సరిచేయుట తేలిక విరిగిన మనస్సును - సరిచేయుట కష్టము
784. తన అజ్ఞానము - తెలుసుకోవడమే నిజమైన - జ్ఞానము
785. ఏ మార్గమైనా పర్వాలేదు-దుర్మార్గము కాకుంటే చాలు
786. నోటితో దేవుని స్మరించు-చేతితో ప్రాణులకు సహకరించు
787. శుద్ధి లేని - ఆచారము-భూత దయ లేని - తపస్సు సత్యము లేని - వాక్కు వ్యర్థము
788. దేహాన్ని, గృహాన్ని అలంకరించుటలో తృప్తి పడకు సద్గుణాలతో మనసును అలంకరించు సంతృప్తి చెందుము
789. మీరు చెప్పిందే - సరియైనదని మీరు చేసిందే - సక్రమమని మీకు నచ్చిందే - మంచిదని
మీరు మెచ్చిందే - మేలైనదని మీ మాటలే - నెగ్గాలని భావించవద్దు, వాదులాడవద్దు
ఎదుటివాని అభిప్రాయం వినుటకు తెలుసుకొనుటకు కూడా ప్రాధాన్యత ఇచ్చుట మరువవద్దు
790. ఇనుమును చెడగొట్టేది - చిలుము మనిషి మనసును చెడగొట్టేవి - దుర్గుణాలు
కావున దుర్గుణాలకు దూరంగా ఉందాం
791. ప్రపంచమే - నీ ಇಲ್ಲು ఇతరులకు - మేలు చేయడయే నీ మతము
792. చెడు వాగుడు వాగి-నోటిని కలుషితం - చేసుకోకు నోటిని నీ అదుపులో - ఉంచుకొనుట మరవబోకు నోరు జారితే - అమిత బాధని తెలుసుకో నోటికి మీటరు అవసరమని తెలుసుకో
ఆ మీటరు బిల్లు - పెరగకుండా చూచుకో
793. పుచ్చుకొనుట - అందరికీ తెలుసు ఇచ్చుకొనుట - కొందరికే తెలుసు
794. నిరంహంకారము - నిర్మలత్వమును కలిగించును అహంకారము - అధోగతిని కలిగించును
795. అన్నీ తెలిసినను విర్రవీగడు - వివేకవంతుడు ఏదీ తెలియకపోయిన విర్రవీగును - వివేకరహితుడు
796. హద్దు, పద్దు, సరిహద్దు, అదుపులేని కోరికలు - వద్దు ఇది రహదారికి ఆటంకాలని మరువ - వద్దు
797. మనస్సును - అదుపులో పెట్టుకో మంచితనముతో - మసలుకో మనసును గాయపరచి - మలినం అంటించుకోకు మానసిక ప్రశాంతత - అలవరచుకో మానవత్వం విలువ - తెలుసుకో
మంచి మనసున్న - మనిషివి అనిపించుకో మానవత్వానికి - సార్థకత చేకూర్చుకో
798. హితం - విషం అనిపించరాదు నిజాలు - కష్టమనిపించరాదు
799. దేవుడంటే - మనకు ఇష్టమే దేవుడు - మనమంటే ఇష్టపడాలి దేవుడు చెప్పిన - మంచి పనులు చేయాలి దేవుడికి - దగ్గర కావాలి గాలి లేని చోట - ఉండవచ్చు దేవుడు లేని చోట - ఉండనే ఉండలేము
800. అసత్యాన్ని - అనుసరిస్తున్నారు సత్యాన్ని - అణగత్రొక్కుతున్నారు సత్య వాక్కుకు గల బలము - చెప్పలేని బలమన్నారు సత్యాన్నే పలుకుదాం - అసత్యాన్ని అంతము చేద్దాం
801. కష్టాలు అని కలత చెందకు. నష్టాలు అని - నలిగి పోకు. కష్టమేలేకున్న - సుఖము యొక్క మధురానుభూతి తెలియదన్న. తినగ తినగ వేము - తీయగ నుండన్నా
802. సురాపాన మత్తు - కొంతవరకే ప్రమాదకరం ఐశ్వర్య మత్తు - కొన్నిటికే ప్రమాదకరం
అధికార మత్తు - అధిక ప్రమాదకరం